Telangana budget 2025: వారికి బంపర్ న్యూస్.. బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పెద్దపీట!

తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తం మూడు లక్షల పది కోట్ల రూపాయల అంచనా తో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ తెలంగాణ క్యాబినెట్ ఆమోదం పొందింది. 2025- 2026 వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రజాభవన్ లో ఉన్న ఆలయంలో బడ్జెట్ ప్రజలతో పూజలు చేశారు. ఈ పూజలలో భట్టి దంపతులు పాల్గొన్నారు.

బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పెద్దపీట
ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీకి వెళ్లి అక్కడ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పెద్దపీట వేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున కృషి చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఇల్లు లేని నిరుపేదల నుండి దరఖాస్తులు స్వీకరించి ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారులను సర్వే చేసి ఇళ్ళ నిర్మాణం మొదలుపెట్టింది.

Telangana budget 2025 Bumper news Indiramma housing scheme gets a big place in the budget

బడ్జెట్ లో ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి పెద్దపీట

ఈ క్రమంలోనే తాజా బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి భారీగా నిధులను కేటాయించారు. మొత్తం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 37,274 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదించారు. ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత లోక్సభ ఎన్నికల కారణంగా మొట్టమొదట ఓటాన్ ఎకౌంటు బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆపై 2024 జులై 25వ తేదీన పూర్తి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది.

2025-26 సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్
అయితే ప్రస్తుతం మాత్రం ఈ ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఇక ఈ బడ్జెట్లో పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం ప్రధమ ప్రాధాన్యతగా బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్టు భట్టి విక్రమార్క తెలిపారు. ఇదిలా ఉంటే సంక్షేమానికి, అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ విద్యా, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం తదితర రంగాలకు ప్రాధాన్యత కల్పిస్తూ బడ్జెట్ కేటాయింపులు చేసినట్టు సమాచారం.

రానున్న నాలుగేళ్ళలో రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఇళ్ళు
ఇదిలా ఉంటే రానున్న నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఇళ్ళు నిర్మించి, లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం సంకల్పబద్ధంగా పని చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే తెలిపారు. ఈ గృహ నిర్మాణాలు పూర్తిగా పారదర్శకంగా జరుగుతాయని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను నిజం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఇందులో భాగంగా బడ్జెట్ లోనూ భారీ కేటాయింపులు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+