నేడే తెలంగాణ బడ్జెట్.. కొత్త పథకాలు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం నేడు బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అలాగే శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ఇవాళ ఉదయం మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మంత్రి వర్గం బడ్జెట్ ను ఆమోదించనుంది.
ఇక ఈ ఏడాది బడ్జెట్ రూ.3.26 లక్షల కోట్లు ఉండొచ్చని సంబంధిత అధికారుల ద్వారా సమాచారం అందుతోంది. సంక్షేమం, నీటి పారుదల, వ్యవసాయం రంగాలకు భారీగా కేటాయింపులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుతోపాటుగా తెలంగాణ విజన్-2047 డాక్యుమెంట్ అమలుపై పలు కీలక నిర్ణయాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

ఈమేరకు ఇవాళ ఉదయం 9 గంటల 30 నిమిషాలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్ ను ఆమోదించనున్నారు. ఇక రైతు భరోసా, రైతు బీమా, సన్న వడ్ల బోనస్ వంటి పథకాల కోసం భారీ నిధులను కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. నీటిపారుదల ప్రాజెక్టులకు కూడా సరిపడ నిధులు కేటాయించి, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications