యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం వద్ద కొత్త హెలికాప్టర్‌కు పూజలు, ఇది ఎవరిదంటే?
హైదరాబాద్: ఎవరైనా వాహనాలు కొనుగోలు చేసిన తర్వాత దేవాలయాల వద్ద పూజలు చేయించడం సాధారణమే. కానీ, ఓ వ్యాపారవేత్త ఏకంగా హెలికాప్టర్ కొనుగోలు చేసి దాని పూజను ప్రముఖ దేవాలయం వద్ద చేయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త ప్రైవేట్ హెలికాప్టర్ కొనుగోలు చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం వద్ద ఆ హెలికాప్టర్‌కు ప్రత్యేక పూజలు చేయించారు. ఓ ప్రైవేటు హెలికాప్టర్ కు యాదాద్రిలో పూజలు నిర్వహించడం ఇదే తొలిసారి.

కరీంనగర్‌కు చెందిన ప్రతిమా ఇనిస్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ ఎండీ, హైదరాబాద్ ఎయిర్‌లైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ బోయిన్‌పల్లి శ్రీనివాసరావు ఈ అత్యాధునిక, విలాసవంతమైన హెలికాప్టర్(Airbus ACH-135)ను కొనుగోలు చేశారు.
ఈ క్రమంలోనే ఆయన యాదాద్రి ఆలయం వద్ద చాపర్‌కు ప్రత్యేక పూజలు చేయించారు. ఈ పూజా కార్యక్రమంలో బోయిన్‌పల్లి శ్రీనివాసరావుతోపాటు మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, ఆయన కుటుంబసభ్యులు పాల్గొన్నారు.పూజ అనంతరం శ్రీనివాసరావు హెలికాప్టర్‌ను స్టార్ట్ చేశారు. అనంతరం కాసుపు హెలికాప్టర్ గాల్లో చక్కర్లు కొట్టింది.
Richie Rich of Hyderabad. Prathima group owner Boinpally Srinivas Rao purchased Airbus ACH 135 and took it to Sri Lakshmi Narasimha Swamy temple in Yadadri for the ‘Vahan’ pooja. The luxury helicopter has a price tag of .7M.#Telangana pic.twitter.com/sn7qZKmSM9
— Ashish (@KP_Aashish) December 15, 2022
కాగా, హెలికాప్టర్ ను చూసేందుకు అక్కడికి భారీగా జనం చేరుకున్నారు. ఆ హెలికాప్టర్‌ను శ్రీనివాసరావు 5.7 మిలియన్ డాలర్లతో కొనుగోలు చేసినట్లు తెలిసింది.
ప్రతిమ గ్రూప్ మౌలిక సదుపాయాలు, ఇంధనం, తయారీ, టెలికాం రంగాలలో ప్రాజెక్టులను చేపడుతోంది. ముఖ్యంగా వైద్య కళాశాల, ఆస్పత్రులను నిర్వహిస్తోంది.












Click it and Unblock the Notifications