వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

telangana lockdown ముగింపు? -రాత్రి కర్ఫ్యూ కొనసాగింపు? -కేబినెట్ అత్యవసర భేటీకి కేసీఆర్ పిలుపు

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత దాదాపు తగ్గింది. ఆరోగ్య శాఖ శుక్రవారం నాటి లెక్కల ప్రకారం కొత్తగా 1,417 కేసులు, 12 మరణాలు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 1,897 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19,29 యాక్టివ్ కేసులున్నాయి. లాక్ డౌన్ సడలింపులతో ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకోగా, మూడో వేవ్ భయాల నేపథ్యంలో లాక్ డౌన్ అమలుపై సర్కారు లోతైన సమాలోచనలు జరుపుతున్నది. ఈ క్రమంలోనే..

covid vaccine: సెక్స్ సామర్థ్యం కోల్పోతారా? వీర్య కణాలు తగ్గుతాయా? -అధ్యయనంలో ఏం తేలిందంటేcovid vaccine: సెక్స్ సామర్థ్యం కోల్పోతారా? వీర్య కణాలు తగ్గుతాయా? -అధ్యయనంలో ఏం తేలిందంటే

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ శనివారం అత్యవసరంగా సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో భేటీకి రావాల్సిందిగా మంత్రులకు ఇప్పటికే సమాచారం వెళ్లింది. శనివారం(జూన్ 19)తోనే లాక్‎డౌన్ ముగియనున్న నేపథ్యంలో కొవిడ్ పరిస్థితుల రీత్యా రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగించాలా వద్దా..? లేకుంటే నైట్ కర్ఫ్యూ విధించాలా..? అనే దానిపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.

telangana cabinet meet on on friday, cm kcr may remove Lockdown, Retain Only Night Curfew

నిజానికి లాక్ డౌన్ పొడగింపు లేదా ముగింపునకు సంబంధించి శుక్రవారమే ప్రకటన వస్తుందని భావించినా, శనివారం జరగబోయే అత్యవసర కేబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకుంటారని ఆలస్యంగా వెల్లడైంది. శుక్రవారం ఉదయం నుంచి ప్రగతి భవన్ లో మంత్రుల సందడి కనిపించింది. హరీశ్‌రావు, మహామూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్‌ తదితరులు హాజరైన సమావేశాల్లో లాక్ డౌన్ పైనే చర్చించినట్లు సమాచారం.

Kerala Island: కొత్త దీవి కలకలం -Google Maps చూపిస్తున్నది నిజమేనా? -Kochi తీరంలో ఏం జరిగింది?Kerala Island: కొత్త దీవి కలకలం -Google Maps చూపిస్తున్నది నిజమేనా? -Kochi తీరంలో ఏం జరిగింది?

తెలంగాణలో ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాక్‌డౌన్ ఉంది. అయితే శనివారం చేయబోయే ప్రకటన ఎలా ఉంటుందన్న దానిపై రాష్ట్ర ప్రజానికంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరోనా సంబంధిత విషయాలతోపాటు వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయం సంబంధిత సీజనల్ అంశాలు, గోదావరిలో నీటిని లిఫ్టు చేసే అంశం, హైడల్ పవర్ ఉత్పత్తి వంటి కీలక అంశాలపైనా కేబినెట్ లో చర్చించనున్నారు.

English summary
In a press communique, the government said that an emergency State Cabinet meeting will be held at Pragathi Bhavan on Saturday at 2 PM under the chairmanship of Chief Minister K Chandrashekhar Rao. "In the meeting, the Cabinet is expected to discuss matters such as Lockdown in the State, rainfall, cultivation in the Monsoon season, agriculture-related seasonal issues, lifting of Godavari waters, Hydel power generation and other issues would be discussed," reads the press communique.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X