ఫలితాల వేళ కేసీఆర్ భారీ ట్విస్ట్ - కీలక నిర్ణయం..!?
తెలంగాణలో అధికారం ఎవరిది. పోలింగ్ పూర్తయింది. ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. కాంగ్రెస్ వైపు మెజార్టీ సర్వే సంస్థలు మొగ్గు చూపాయి. కొన్ని సంస్థలు బీఆర్ఎస్, మరి కొన్ని హంగ్ దిశగా తమ అంచనాలను ప్రకటించాయి. ఇదే సమయంలో కేసీఆర్ ఎన్నికల ఫలితాలపై తన అంచనాలను పార్టీ నేతలకు స్పష్టం చేసారు. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 4న మంత్రివర్గ సమావేశానికి నిర్ణయించారు. ప్రస్తుత మంత్రులతోనే..లేక గెలుస్తామనే నమ్మకంతో కొత్త మంత్రులతోనా.
మారుతున్న లెక్కలు : తెలంగాణ ఎన్నికల్లో పోలింగ్ శాతం 70.92%గా నమోదు అయింది. 2018 ఎన్నికల కంటే మూడు శాతం తగ్గింది. పోలింగ్ సరళి పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ అధికారం దక్కించుకుంటుందని సర్వే సంస్థల అంచనాగా స్పష్టం అయింది. కానీ, సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ తో బీఆర్ఎస్ విభేదిస్తోంది. బీఆర్ఎస్ వార్ రూమ్ లో ప్రతీ నియోజకవర్గం నుంచి ఓటింగ్ సరళి పైన పూర్తి సమాచారం సేకరించారు. విశ్లేషించారు. చివరగా ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోయినా..అధికారం ఖాయమనే అంచనాకు వచ్చారు. ఎన్నికల సరళిపై పార్టీ ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. మరోసారి రాష్ట్రానికి సుపరిపాలన అందించబోతున్నామని చెప్పుకొచ్చారు.

ధీమాగా సీఎం కేసీఆర్ : పార్టీ నేతలు పరేషాన్ అవ్వద్దని..రెండు రోజులు ప్రశాంతంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. 3న అందరం కలిసి సంబరాలు చేసుకుందామని వ్యాఖ్యానించినట్లు సమాచారం. మంత్రి కేటీఆర్ సైతం ట్వీట్ ద్వారా ఇదే విషయాన్ని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా ఎగ్జాక్ట్ రిజల్ట్ బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటుందంటూ పార్టీ నేతలకు గుడ్ న్యూస్ గా చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది. ఈ నెల 4న మధ్నాహ్నం తెలంగాణ మంత్రివర్గ సమావేశానికి నిర్ణయించారు. ఫలితాలు ఎలా ఉంటాయనే ఉత్కంఠ కొనసాగుతున్న వేళ సీఎం కేసీఆర్ కేబినెట్ భేటీ ఏర్పాటు నిర్ణయం ద్వారా పరోక్షంగా తామే గెలుస్తున్నామనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

మంత్రివర్గ సమావేశం : ఈ నెల 3న ఫలితాల్లో గెలిచే మంత్రులు ఎవరు..ఓడేదెవరు అనేది స్పష్టత వస్తుంది. అయితే, గెలుస్తామనే ధీమాతో కేసీఆర్ ఈ సమావేశానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ లో కొత్త చర్చ జరుగుతోంది. ఈ సమావేశం ప్రస్తుత మంత్రులతోనా..కొత్త మంత్రులతోనా అనే చర్చ మొదలైంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ గెలుపు ఖాయమనే చర్చ పోలింగ్ వరకు హైప్ క్రియేట్ చేసింది. ఇప్పుడు, కౌంటింగ్ వేళ బీఆర్ఎస్ లో అంతర్గతంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్నాయి. ఈ మొత్తానికి ఈ నెల 3వ తేదీ కౌంటింట్ రోజునే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications