తెలంగాణలో రీపోలింగ్ అంశంపై తేల్చేసిన వికాస్ రాజ్: తొలి ఫలితం ఎప్పుడంటే?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ రాజ్ కీలక అంశాలపై స్పందించారు. తెలంగాణలో పోలింగ్ పూర్తిగా ముగిసిన అనంతరం పరిశీలిస్తే... 70.74 శాతం ఓటింగ్ నమోదైందని వెల్లడించారు. హైదరాబాదులో అత్యల్పంగా 46.68 శాతం ఓటింగ్ నమోదైనట్టు తెలిపారు. మునుగోడులో అత్యధికంగా 91.05 శాతం పోలింగ్ నమోదైందని పేర్కొన్నారు.

అయితే, గతంలో కంటే ఈసారి పోలింగ్ 3 శాతం తక్కువగా నమోదైందని తెలిపారు. 2018 ఎన్నికల సమయంలో పోలింగ్ శాతం 73.37 అని వెల్లడించారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువని వికాస్ రాజ్ తెలిపారు.

Telangana ceo vikas raj key comment -over re-polling issue

డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని.. అందుకోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని వికాస్ రాజ్ చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ దాదాపు ప్రశాంతంగానే జరిగిందని.. ఎక్కడా రీ పోలింగ్ కు అవకాశం లేదని స్పష్టం చేశారు.

ఈసారి ఓట్ ఫ్రమ్ హోమ్ విధానం సత్ఫలితాలను ఇచ్చిందని వికాస్ రాజ్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.80 లక్షల మంది ఓటేశారని వెల్లడించారు. సీ విజిల్ యాప్ ద్వారా 10,132 ఫిర్యాదులు వచ్చాయని వికాస్ రాజ్ పేర్కొన్నారు. ఈసారి ఓటర్లలో 18, 19 ఏళ్ల వయసున్న వారు 3.06 శాతం ఉన్నారన్నారు.

తొలి ఫలితం 10.30కు

కాగా, ఆదివారం ఉదయం 8.00 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెకిస్తారని, ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని వికాస్ రాజ్ చెప్పారు. మొదటి ఆధిక్యం 10.30 ప్రాంతంలో తెలిసే అవకాశం ఉందని తెలిపారు. ఇవాళ, రేపు కౌంటింగ్‌ ఏర్పాట్లు జరుగుతాయన్నారు. చిన్న నియోజకవర్గాల్లో ఉదయం 10.30కు తొలిరౌండ్‌ ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+