కేసీఆర్ డుమ్మా, మతంతో ముడిపెట్టొద్దని అలీ: బాలకృష్ణ ఆసనాలు (పిక్చర్స్)
హైదరాబాద్: మంగళవారం నాడు ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. భారత దేశంలో పలువురు రాష్ట్రపతి, ఆయా రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు బెజవాడలో పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాత్రం డుమ్మా కొట్టారు! ఎల్బీ స్టేడియంలో జరిగిన యోగా దినోత్సవంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డిలు పాల్గొన్నారు.
గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో యోగా దినోత్సవం జరిగింది. ఇందులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగాను మతంతో ముడి పెట్టవద్దని, ఇది శారీరక, మానసిక ఆరోగ్య సంరక్షణకు దోహదం చేస్తుందన్నారు.

యోగా దినోత్సవంలో పాల్గొనని కేసీఆర్
మంగళవారం నాడు ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. భారత దేశంలో పలువురు రాష్ట్రపతి, ఆయా రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు బెజవాడలో పాల్గొన్నారు.

గచ్చిబౌలిలో యోగా దినోత్సవం
గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ప్రపంచ యోగా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాజ్ భవన్‌లో యోగా డే
రాజ్ భవన్‌లో ప్రపంచ యోగా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి తదితరులు పాల్గొన్నారు.

ఎల్పీ స్టేడియంలో యోగా డే
హైదరాబాదులోని ఎల్పీ స్టేడియంలో (ఇండోర్) ప్రపంచ యోగా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, చిన్నారులు పాల్గొన్నారు.

ఎల్పీ స్టేడియంలో యోగా డే
హైదరాబాదులోని ఎల్పీ స్టేడియంలో ప్రపంచ యోగా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

యోగా డేలో బాలకృష్ణ
మంగళవారం నాడు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా కేబీఆర్ పార్కులో జరిగిన వేడుకల్లో పాల్గొన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.

యోగా డేలో బాలకృష్ణ
మంగళవారం నాడు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా కేబీఆర్ పార్కులో జరిగిన వేడుకల్లో పాల్గొన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.

సాయి ధరమ్ తేజ
ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం నాడు హీరో సాయిధరమ్ తేజ ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్లి పిల్లలతో గడిపారు.

అపోలో ఆసుపత్రిలో యోగా డే
ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం నాడు అపోలో ఆసుపత్రిలో యోగా కార్యక్రమం నిర్వహించారు.












Click it and Unblock the Notifications