వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుగులేని ఆధిక్యత: సీఎం నితీశ్‌కు కేసీఆర్ శుభాకాంక్షలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నితీశ్ కుమార్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. సీఎం నితీశ్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆదరాభిమానులు చూరగొన్నందుకే నితీశ్ కుమార్‌‌కు ఈ ఘన విజయం దక్కిందన్నారు.

ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు బీహార్ సీఎం, జెడీయు ముఖ్యనేత నితీష్ కుమార్‌కు అభినందనలు తెలిపారు. నితీష్‌కు చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి.

Telangana CM KCR congratulates to nitish kumar

సీఎం నితీశ్ కుమార్ సారధ్యంలోని మహాకూటమి తిరుగులేని ఆధిక్యతను సాధించింది. దీంతో బీహార్‌లో తన ఆధిక్యానికి తిరుగులేదని నితీశ్ కుమార్ మరోసారి నిరూపించాడు. గతంలో బీజేపీతో కలిసి రెండు సార్లు విజయం సాధించిన నితీశ్, తాజాగా మాహాకూటమితో కలిసి ఇప్పుడు మూడోసారి విజయం సాధించాడు.

ఇక నితీశ్ విషయానికి వస్తే, 2005లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి వరకు అటవికరాజ్యంగా బీహార్‌కు చెడ్డపేరు ఉంది. ఆ చెడ్డపేరుని తొలగించేందుకు నితీశ్ కుమార్ తీవ్రంగా కృషి చేశాడు. బీహార్‌లో శాంతి భద్రతలను దారిలోకి తెచ్చారు. రాష్ట్రంలో వివిధ సంస్కరణలను ప్రవేశపెట్టి జీడీపీ పెరుగదల కోసం ఎంతో శ్రమించాడు.

నితీశ్ హయాంలోనే జాతీయ స్థాయిలో జీడీపీ బాగా పెరిగిన రాష్ట్రాల్లో ఒకటిగా బీహార్ నిలిచింది. బీహార్ రాజకీయాల్లో నితీశ్ కుమార్‌ ప్రత్యేకం. 10ఏళ్ల పాటు కొనసాగిన ఆయన పాలనలో ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం గమనార్హం. తనని తాను బీహారీగా చెప్పుకునేందుకే ఇష్టపడతానని చాలా సందర్భాల్లో నితీశ్ ప్రస్తావించారు.

దీంతో బీహార్ ప్రజలు నితీశ్‌ను అమితంగా ఇష్టపడతారు. అంతేకాదు ఆయన పరిపాలన విధానం అవినీతి మరకలు లేకుండా ఉండటంతో సాధారణ బీహారీల నుంచి ఉన్నత వర్గాల వరకు ఆయన విజయంలో వెన్నంటే ఉన్నారు.

గతంలో నితీశ్ సాధించిన విజయాలు:

* 2000 మార్చి 3 నుంచి మార్చి 10వ తేదీ వరకు కేవలం 7 రోజులు మాత్రమే సీఎం పదవిలో ఉన్నారు.
* ఆ తర్వాత లాలూ భార్య రబ్రీదేవి అధికారంలోకి వచ్చారు.
* 2005 నవంబరు 24 నుంచి 2010 నవంబరు 24 వరకు నితీశ్ ముఖ్యమంత్రిగా పూర్తి కాలం పదవిలో కొనసాగారు.
* 2010 ఎన్నికల్లో నితీశ్ విజయం సాధించడంతో నవంబరు 26 నుంచి 2014 మే 17 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

English summary
Telangana CM KCR congratulates to nitish kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X