‘ఏపి సిఎంలకు డబ్బు సంచులు మోసినోళ్లు’(పిక్చర్స్)
నల్గొండ: ఆంధ్రా సిఎంలకు డబ్బు సంచులు మోసినోళ్లు, మేం చేపట్టిన వాటర్ గ్రిడ్ గురించి కాంగ్రెసోళ్లు ఊహించుకుంటే కింద పడిపోతారని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. నల్గొండ జిల్లాలో ఒక నాయకుడున్నాడు, అతడు ఉత్తమ్‌కుమార్ కాదు అతడు ఉత్తర కుమారుడని ఎద్దేవా చేశారు. ‘స్కీమ్ మొదలు పెట్టకముందే ఆయనకు అవినీతి కనబడిందట. అలా బతికేటోళ్ళు కాబట్టి అన్నీ వాళ్లకు అలాగనే కనిపిస్తాయి. పచ్చకామెర్లోడికి లోకం అంతా పచ్చగా కనబడుతుంది' అని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ నాయకులకు చిల్లర రాజకీయాలు తప్ప అభివృద్ధి కనిపించదని అన్నారు. జిల్లా ప్రజల దు:ఖం తనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. సోమవారం చౌటుప్పల్‌లో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ పైలాన్ ఆవిష్కరించిన సిఎం. అనంతరం దామరచర్ల మండలం వీర్లపాలెంలో యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత నల్గొండ పట్టణంలో జరిగిన తెలంగాణ ప్రగతి పథం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.
ఇంటింటికి నీరు, కరెంటు ఇచ్చే రెండు బృహత్తర ప్రాజెక్టులను నల్గొండ జిల్లాలోనే ప్రారంభించడం తనకెంతో తృప్తిగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం 2019 నాటికి దేశంలోనే అత్యంత మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలుస్తుందని అన్నారు. రూ.91,500 కోట్లతో 25వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు.
దేశంలోనే పెద్దదైన నాలుగువేల మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు (యూఎంపీపీ)కు భూమి పూజచేసి వచ్చానని తెలిపారు. అదేవిధంగా మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా తెలంగాణలో ప్రతి ఇంటికీ, ప్రతి గుడిసెకు, దూరంగా ఉన్న బస్తీకి కూడా ప్రభుత్వమే ఖర్చుపెట్టి మంచినీరు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టామని, సుమారు రూ.40వేల కోట్లతో వాటర్‌గ్రిడ్ అమలుచేస్తున్నామని తెలిపారు. మొత్తం లక్షా 30 వేల కోట్లతో ఒకే రోజు అభివృద్ధి కార్యక్రమాలు పారంభించుకోవడం తనకెంతో తృప్తిగా ఉందన్నారు.
నల్గొండ జిల్లా ప్రజల దుఃఖం నాకు తెల్సినంతగా మరెవ్వరికీ తెలియదని, దేశపతి శ్రీనివాస్, తాను ఎనిమిది రోజుల పాటు ఇక్కడే పడుకుని, గ్రామ గ్రామాన తిరిగి ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నామని చెప్పారు. నల్గొండ బాధను, దుఖాన్ని గుండెల్లో పెట్టుకున్నట్లు తెలిపిన ఆయన, చూడు చూడు నల్గొండ అనే పాట తాను దేశపతి కలిసి రాసినట్లు చెప్పారు.
నల్గొండ జిల్లానుంచి ఫ్లోరైడ్ రక్కసిని పారదోలాలని నిర్ణయించామని, అందుకే మునుగోడులో వాటర్‌గ్రిడ్ పైలాన్ ఏర్పాటుచేశామని చెప్పారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, డబుల్ బెడ్‌రూమ్‌లను ప్రభుత్వమే కట్టి ఇస్తుందని తెలిపారు.

కెసిఆర్
నల్గొండ జిల్లా ప్రజల దు:ఖం తనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు.

కెసిఆర్
సోమవారం చౌటుప్పల్‌లో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ పైలాన్ ఆవిష్కరించిన సిఎం. అనంతరం దామరచర్ల మండలం వీర్లపాలెంలో యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు.

కెసిఆర్
ఆ తర్వాత నల్గొండ పట్టణంలో జరిగిన తెలంగాణ ప్రగతి పథం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.

కెసిఆర్
ఇంటింటికి నీరు, కరెంటు ఇచ్చే రెండు బృహత్తర ప్రాజెక్టులను నల్గొండ జిల్లాలోనే ప్రారంభించడం తనకెంతో తృప్తిగా ఉందన్నారు.

కెసిఆర్
తెలంగాణ రాష్ట్రం 2019 నాటికి దేశంలోనే అత్యంత మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలుస్తుందని అన్నారు. రూ.91,500 కోట్లతో 25వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులకు ప్రభుత్వం శ్రీకారం

కెసిఆర్
దేశంలోనే పెద్దదైన నాలుగువేల మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు (యూఎంపీపీ)కు భూమి పూజచేసి వచ్చానని తెలిపారు.

కెసిఆర్
అదేవిధంగా మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా తెలంగాణలో ప్రతి ఇంటికీ, ప్రతి గుడిసెకు, దూరంగా ఉన్న బస్తీకి కూడా ప్రభుత్వమే ఖర్చుపెట్టి మంచినీరు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టామని, సుమారు రూ.40వేల కోట్లతో వాటర్‌గ్రిడ్ అమలుచేస్తున్నామని తెలిపారు.

కెసిఆర్
మొత్తం లక్షా 30 వేల కోట్లతో ఒకే రోజు అభివృద్ధి కార్యక్రమాలు పారంభించుకోవడం తనకెంతో తృప్తిగా ఉందన్నారు.
2019నాటికి 25వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనను సాధిస్తామన్నారు. నల్గొండ జిల్లా మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు ఒక్క లిఫ్ట్‌తో శ్రీశైలం నుండి కృష్ణా నీటిని అందించేందుకు జూన్ 12న 6వేల కోట్లతో నక్కలగండి కంటే మెరుగైన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తామన్నారు.
ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు 1లక్ష 50వేల ఎకరాలకు నీరందించేందు మెదక్ కొమిరెల్లి మల్లన్న ప్రాజెక్టును చేపడుతామన్నారు. ఎస్‌ఎల్‌బిసి టనె్నల్‌ను పూర్తి చేసి తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలకు కూడా నీరందిస్తామన్నారు. వచ్చే నాలుగేళ్లలో ప్రజలకు నాలుగు పైసలు కూడా ఖర్చులేకుండా వాటర్‌గ్రిడ్ పథకాన్ని అందించి తీరుతామని కెసిఆర్ అన్నారు.












Click it and Unblock the Notifications