Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అరుదైన ఘట్టం: తాను చదువుకున్న బడికి సీఎం హోదాలో కేసీఆర్ శంకుస్థాపన

హైదరాబాద్: తాను చదువుకున్న పాఠశాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. సోమవారం మెదక్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా మెదక్ జిల్లా దుబ్బాక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నూతన భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు.

అరకొర వసతుల మధ్య విద్యనభ్యసించిన ఆనాటి విద్యార్ధి కేసీఆర్, ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో పాఠశాల నూతన భవనానికి శంకుస్థాపన చేయడం అక్కడున్న వారిని ఎంతో సంతోషానికి గురి చేసింది. ఇంద్రభవనాన్ని తలపించేలా అత్యాధునిక సౌకర్యాలతో స్కూలుని నిర్మించనున్నారు. ఈ స్కూలు కాంట్రాక్టుని గెలాక్సీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ కాంట్రాక్టు చేజిక్కించుకుంది.

తాను అష్టకష్టాలు పడి విద్యను పూర్తిచేశానని, తనకొచ్చిన బాధలు ఇప్పుడు చదువుకునే విద్యార్థులకు రావొద్దన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ పాఠశాల నూతన భవన నిర్మాణానికి రూ.4.67 కోట్లను మంజూరు చేశారు. తాను చదువుకున్న స్కూలుని దేశంలోనే ఓ ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకొచ్చారు.

సీఎం కేసీఆర్ ఒకటో తరగతి నుంచి రెండో తరగతి వరకు అంకంపేట, మూడో తరగతి చింతమడకలో నాలుగో తరగతి నుంచి పదో తరగతి (1964 నుంచి 69) వరకు దుబ్బాకలో చదువుకున్నారు. పదో తరగతి చదువుతున్న సమయంలో అనివార్య పరిస్థితుల కారణంగా విద్యా సంవత్సరం చివరి నాలుగు నెలల ముందు ఇక్కడి నుంచి పుల్లూరు హైస్కూల్‌కు వెళ్లి, అక్కడే పదో తరగతి పరీక్షలు రాశారు.

Telangana CM KCR lays foundation stone for School building at Dubbaka

చిన్నప్పుడు కేసీఆర్ తన విద్యాభ్యాసం కోసం ప్రతి రోజూ చింతమడక నుంచి దుబ్బాక వరకు సోదరి సుమతి, మిగతా మిత్రులతో కలిసి కాలినడకనే వెళ్లేవారు. తర్వాత కొద్ది రోజులకు చింతమడకకు చెందిన రాఘవరెడ్డి అనే హిందీ పండితుడు ఇదే పాఠశాలలో పని చేసేందుకు బదిలీపై వచ్చారు.

ఆయన దుబ్బాకలోనే నివాసం ఉండటంతో సోదరి సుమతి, కేసీఆర్ కూడా వారి ఇంట్లోనే ఉంటూ చదువుకున్నారు. ఈ క్రమంలో దుబ్బాకలో తన తోటి విద్యార్థులతో స్నేహం ఏర్పడింది. పాఠశాలలో జరిగే సాంస్కృతిక ప్రదర్శనల్లో భాగంగా పౌరాణిక నాటకాల్లో కూడా కేసీఆర్ పాత్రలు వేసేవారని అతని మిత్రులు చెప్తుంటారు.

సీఎం కేసీఆర్ రాకను పురస్కరించుకుని బాల్యమిత్రులు దుబ్బాకకు చేరుకున్నారు. వీరితో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమై ఆత్మీయతను పంచుకోనున్నారు. మధ్యాహ్నం 3.40 గంటల సమయంలో వెంకటేశ్వర ఆలయంలో తన బాల్యమిత్రులతో సీఎం గడపనున్నారు.

శ్రీ కృష్ణ పాండవీయం నాటకంలో పంచ పాండవుల్లో చివరి వాడైన సహదేవుని పాత్రను కేసీఆర్ ఎంతో ఇష్టంగా పోషించారని ఆయన మిత్రులు ఇప్పటికీ చెప్తుంటారు. పాఠశాల విద్యార్థి సంఘం నాయకత్వానికి జరిగిన పోటీలో కూడా ఉపాధ్యక్షుడిగా కేసీఆర్ పని చేశారు. విద్యాభ్యాసం, బాల్యమంతా దుబ్బాకలో గడపటంతో ఆయనకు ఇక్కడి ప్రజలతో మంచి సత్సంబంధాలున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+