కేంద్రమంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ: కెసిఆర్ ఢిల్లీ టూర్, ఏమౌతోంది?
హైదరాబాద్: కేంద్రమంత్రివర్గ పునరవ్యవ్యస్థీకరణ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ టూరు రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేకేత్తిస్తోంది.
మూడురోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. కేంద్ర కేబినెట్ విస్తరణకు ముందు కెసిఆర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకొంది.

మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణలో భాగంగా ఇప్పటికే కొందరు మంత్రులు రాజీనామాలు సమర్పించారు. ఈ నెల 3వ, తేదిన కేబినెట్ విస్తరణ జరుగుతోంది.ఎన్‌డిఏ కూటమిలో కొత్త భాగస్వామ్యపక్షాలు చేరుతున్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో కెసిఆర్ ఢిల్లీ టూరుపై పలు రకాల ఊహగాహనాలు విన్పిస్తున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల కాలంలో ఢిల్లీలో కంటి పరీక్షలు నిర్వహించుకొన్నారు.కంటికి శస్త్రచికిత్స చేసుకోవాలని వైద్యులు సూచించారు.
అయితే కంటి పరీక్షల కోసం కెసిఆర్ ఢిల్లీకి వెళ్ళినట్టు అధికారవర్గాల కథనం.వీలు చిక్కితే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానమంత్రిని కెసిఆర్ కలిసే అవకాశం ఉందని సమాచారం.












Click it and Unblock the Notifications