బాల్య మిత్రుడికి కెసిఆర్ పరామర్శ, ఆర్నెళ్ళ తర్వాత...

తన చిన్ననాటి మిత్రుడు కె. రాజేంద్రప్రసాద్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్ళి మరీ కెసిఆర్ ఆయనను పరామర్శించారు.

హైదరాబాద్: తన చిన్ననాటి మిత్రుడు కె. రాజేంద్రప్రసాద్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్ళి మరీ కెసిఆర్ ఆయనను పరామర్శించారు.

స్నేహనికి తెలంగాణ సీఎం కెసిఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తారు. అయితే చిన్ననాటి మిత్రులను గ్రామంలోని పరిస్థితులను అడిగి తెలుసుకొంటారు. అంతేకాదు చిన్ననాటి తమ అభిరుచులను నెమరేసుకొంటారు.

మెదక్ జిల్లాలోని గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని తన పామ్‌హౌజ్‌కు వెళ్ళే సమయంలో తన మిత్రులను కెసిఆర్ కలుసుకోవడం ఆనవాయితీ. అంతేకాదు తాను ప్రయాణం చేసే మార్గంలో స్థానికులతో సీఎం చర్చించి ప్రజల సాధకబాధకాలను తెలుసుకొంటారు.

చిన్ననాటి స్నేహితుడు రాజేంద్రప్రసాద్‌ను పరామర్శించిన కెసిఆర్

చిన్ననాటి స్నేహితుడు రాజేంద్రప్రసాద్‌ను పరామర్శించిన కెసిఆర్

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తన చిరకాల మిత్రుడిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శనివారం పరామర్శించారు. హైదరాబాద్‌ గాంధీనగర్‌లోని ఉదయ్‌ సఫేర్‌ అపార్ట్‌మెంట్‌లో ఉన్న కె. రాజేంద్రప్రసాద్‌ ఇంటికి వెళ్లి కెసిఆర్ రాజేంద్రప్రసాద్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు.. గత పదేళ్లుగా రాజేంద్రప్రసాద్‌ పక్షవాతం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.దీంతో కెసిఆర్ ఆయనను పరామర్శించారు.

 ఆరు నెలల క్రితమే వెళ్ళాలని..

ఆరు నెలల క్రితమే వెళ్ళాలని..

ఆర్నెల్ల క్రితమే కలవాలని భావించినా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే స్నేహితుడిని గుర్తుపెట్టుకుని శనివారం నాడు పరామర్శించారు. దాదాపు 45 నిమిషాలపాటు స్నేహితుని ఇంట్లో గడిపారు.చిన్ననాటి సంగతులను నెమరేసుకొన్నారు. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలని కెసిఆర్ స్నేహితుడు రాజేంద్రప్రసాద్‌కు సూచించారు.

 రేపల్లె కాంగ్రెస్ అభ్యర్థిగా రాజేంద్రసాద్ పోటీ

రేపల్లె కాంగ్రెస్ అభ్యర్థిగా రాజేంద్రసాద్ పోటీ

రాజేంద్రప్రసాద్ కాంగ్రెస్ పార్టీలో గతంలో క్రియాశీలకంగా పనిచేశారు. రాజేంద్రప్రసాద్‌ యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో కేసీఆర్‌ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.దీంతో వీరిద్దరి మధ్య స్నేహం మరింత బలపడిందని వారు గుర్తు చేసుకొన్నారు.గుంటూరు జిల్లా రేపల్లె నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా 1985లో రాజేంద్రప్రసాద్‌ పోటీ చేశారు.

సంతోషం వ్యక్తం చేసిన రాజేంద్రప్రసాద్

సంతోషం వ్యక్తం చేసిన రాజేంద్రప్రసాద్

కెసిఆర్, రాజేంద్రప్రసాద్‌లు ఇద్దరూ కూడ మంచి స్నేహితులు. అయితే ఈ మద్య కాలంలో వారు కలుసుకోవడం మానేశారు. అయితే రాజేంద్రప్రసాద్ ఆరోగ్యం బాగాలేదనే విషయం తెలుసుకొని కెసిఆర్ ఆయనను పరామర్శించారు. అయితే తనను గుర్తుపెట్టుకుని సీఎం పరామర్శించడం చాలా ఆనందంగా ఉందని రాజేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+