వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీతో..: రాజ్‌నాథ్‌తో కేసీఆర్ ఏకాంతంగా, చంద్రబాబు కూడా తేల్చమంటున్నారు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు ఐదు నిమిషాలు ఏకాంతంగా మాట్లాడారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులతో పాటు, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారని తెలుస్తోంది. అదే సమయంలో విపక్షాల వ్యవహార శైలి, పొరుగు రాష్ట్రాలతో తమ సంబంధాలు, ఏపీతో తమ సంబంధాలను వెల్లడించారని తెలుస్తోంది.

ఎంపీలతో కలిసి భేటీ

ఎంపీలతో కలిసి భేటీ

అంతకుముందు ఏంపీలు కేశవ రావు, జితేందర్ రెడ్డిలతో కలిసి కేసీఆర్.. రాజ్‌నాథ్‌తో భేటీ అయ్యారు. విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా నియోజకవర్గాల పెంపుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ అంశాన్ని త్వరగా తేల్చాలన్నారు.

చంద్రబాబు కూడా ఆశక్తి

చంద్రబాబు కూడా ఆశక్తి

ఏపీ సీఎం చంద్రబాబు కూడా దీనిపై ఆసక్తి చూపుతున్నారన్నారు. నియోజకవర్గాల పెంపులో ఉన్న న్యాయపరమైన చిక్కులు తొలగించడానికి తగిన మార్గాలు అన్వేషించాలని కోరారు. విభజన చట్టంలోని 10వ షెడ్యూల్‌లో పేర్కొన్న ఉమ్మడి సంస్థల విభజనను త్వరగా పూర్తి చేయాలన్నారు.

ఉమ్మడి సంస్థలపై

ఉమ్మడి సంస్థలపై

సంస్థలు ఇంకా ఉమ్మడిగా కొనసాగడంతో సమస్యలు వస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. విభజన చట్టంలోని పలు హా మీలు అమలు కాలేదని, వాటిపై దృష్టి సారించాలని కోరారు. రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులను కేటాయించాలని కోరారు.

అధికారుల కోసం విజ్ఞప్తి

అధికారుల కోసం విజ్ఞప్తి

తెలంగాణకు ఐపీఎస్‌ల సంఖ్య తక్కువగా ఉందని, జిల్లాల పెంపుతో ఆ పోస్ట్‌లు మరిన్ని అవసరమవుతాయన్నారు. ఐఏఎస్‌ల సంఖ్య కూడా తక్కువగా ఉందని, వాటి సంఖ్య కూడా పెంచాలన్నారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల ఏర్పాటును ప్రస్తావించారని సమాచారం.

రహదారుల కోసం

రహదారుల కోసం

గోదావరి, ప్రాణహిత నదుల వెంట ఉన్న అటవీ ప్రాంతాల గ్రామాల కోసం రహదారుల నిర్మాణానికి సహకరించాలని కోరారు. కాళేశ్వరం నుంచి అర్జునగుట్ట వరకు రహదారి, కాళేశ్వరం వద్ద గోదావరి నదిపై కి.మీ. పొడవైన వంతెన, రాచర్ల-వేమనపల్లి రహదారి, సోమనిగూడెం రహదారి, గూడెం-బాబాసాహెబ్‌ రహదారులకు రూ.300 కోట్లు మంజూరు చేయాలని కోరారు.

English summary
Telangana CM KCR meets Home Minister Rajnath Singh on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X