మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి ఈటలపై భూకబ్జా ఆరోపణలు... సీఎం కేసీఆర్ సంచలన ఆదేశాలు... ఏం జరగబోతుంది...?

|
Google Oneindia TeluguNews

తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలను ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నారు. ఈ వ్యవహారంపై వెంటనే దర్యాప్తు జరిపించి సమగ్ర నివేదిక అందజేయాల్సిందిగా మెదక్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. భూకబ్జా ఆరోపణల్లో అసలు నిజాలేంటో నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ డీజీ పూర్ణచందర్ రావును సీఎం ఆదేశించారు. భూకబ్జా ఆరోపణలపై తక్షణమే ప్రాథమిక నివేదిక అందజేసి సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఉద్వాసన తప్పదా...?

ఉద్వాసన తప్పదా...?

మంత్రి ఈటలపై ఆరోపణల విషయంలో కేసీఆర్ విచారణకు ఆదేశించడం పెను సంచలనమే అన్న చర్చ జరుగుతోంది. ఈటలకు చెందిన జమున హ్యాచరీస్ భూఆక్రమణకు పాల్పడిందని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇదివరకే వెల్లడించారు. ఇప్పుడు ప్రభుత్వానికి సమర్పించే నివేదికలోనూ ఆయనపై భూకబ్జా ఆరోపణలను రూఢీ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటలపై వేటు వేయడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నారని లీకులు ఇస్తున్నారంటే... ఈటల ఉద్వాసనకు సమయం దగ్గరపడినట్లేనన్న వాదన వినిపిస్తోంది.

ఇప్పుడు ఈటల పరిస్థితేంటి..?

ఇప్పుడు ఈటల పరిస్థితేంటి..?


ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. మంత్రి కేటీఆర్ కూడా కరోనాతో ఐసోలేషన్‌లో ఉన్నారు. కాబట్టి మరికొద్ది రోజుల వరకు ఈటల అటు కేసీఆర్‌ను గానీ,ఇటు కేటీఆర్‌ను గానీ నేరుగా కలిసే అవకాశం లేదు. నిజానికి ఈటల లాంటి పెద్ద నాయకుడిపై భూ ఆరోపణల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా ఆయనతోనే మాట్లాడి వివరణ కోరవచ్చు. కానీ అందుకు విరుద్దంగా ప్రభుత్వ యంత్రాంగంతో ఆయన విచారణకు ఆదేశించారు. ఈటలపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనేందుకు ఇదే నిదర్శనమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Recommended Video

Gangavva ఇంటి పనులు.. ఓ పనైపోయింది ! || Oneindia Telugu
ఏ మలుపు తిరుగుతుందో..?

ఏ మలుపు తిరుగుతుందో..?

ఈటలపై భూకబ్జా ఆరోపణలు వెలుగులోకి రాగానే... ఇక ఆయనకు ఉద్వాసన పలికినట్లే అన్న కథనాలు వస్తున్నాయి. టీఆర్ఎస్ మౌత్ పీస్‌గా ఉండే మీడియాలో 'ఆరోగ్య శాఖ మంత్రికి కబ్జా రోగం' పేరుతో కథనాలను ప్రసారం చేయడం గమనార్హం. ఒకవేళ అధిష్ఠానానికి ఈటలపై సాఫ్ట్ కార్నర్ ఉండి ఉంటే... ఆయన కబ్జా వ్యవహారం ఇలా టీవీ ఛానెళ్లకి ఎక్కేది కాదన్న వాదన వినిపిస్తోంది. కాబట్టి ఈటలపై అధిష్ఠానం ఆగ్రహానికి ఇప్పుడీ ఆరోపణల వ్యవహారం మరింత ఆజ్యం పోసినట్లయిందన్న ప్రచారం జరుగుతోంది. కబ్జా జరిగిందని అడిషనల్ కలెక్టర్ కూడా మీడియా ఛానెళ్లతో మాట్లాడుతూ వెల్లడించారు. సీఎంకు ఇచ్చే నివేదికలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించవచ్చు. అదే జరిగితే కేసీఆర్ ఆయన్ను సాగనంపడం ఖాయమేనన్న ప్రచారం జోరందుకుంది. ఇప్పటికైతే తనపై ఆరోపణల విషయంలో ఈటల ఎక్కడా స్పందించలేదు. ఈ వ్యవహారాన్ని ఆయన ఎలా ఎదుర్కోబోతున్నారు... చివరకు ఇది ఏ మలుపు తిరుగుతుందన్న ఉత్కంఠ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నెలకొంది.

English summary
Telangana Chief Minister KCR is seriously considering the land grabbing allegations against Telangana Health Minister Etala Rajender. The Medak District Collector has been directed to immediately investigate the matter and submit a comprehensive report. The CM directed Vigilance DG Poornachandra Rao to find out the facts of the land grab allegations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X