కేంద్రమంత్రికి సీఎం కేసీఆర్ కీలక సూచనలు: బాగున్నాయని అభినందించిన ప్రధాని మోడీ
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌తో సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. కరోనా నియంత్రణకు రాష్ట్రం చేపడుతున్న చర్యలను ఆయనకు సీఎం వివరించారు. కరోనా నియంత్రణకు కొన్ని సూచనలు చేశారు.

కేంద్రమంత్రి హర్షవర్ధన్‌కు కేసీఆర్ ఫోన్.. కీలక సూచనలు
కరోనా వ్యాప్తికి కారణమవుతున్న వారిని గుర్తించి టీకాలు వేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆటోడ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, గ్యాస్ డెలివరీ బాయ్స్, వీధి వ్యాపారులు, కార్మికులను గుర్తించి వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించారు. కేసీఆర్ సూచనలపై హర్షవర్ధన్ సానుకూలంగా స్పందించారు. ప్రధానితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

కేసీఆర్‌ను అభినందించిన ప్రధాని మోడీ
అనంతరం ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు సీఎం. కేసీఆర్ సూచనలు బాగున్నాయని, కేంద్రమంత్రి హర్షవర్ధన్ తనకు వివరించారని మోడీ తెలిపారు. వాటిని ఆచరణలో పెడతామని చెప్పారు. మంచి సూచనలను చేసినందుకు కేసీఆర్‌ను ప్రధాని అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ఆక్సిజన్, రెమిడిసివిర్ ఔషధాలను సరఫరా చేయాలని ప్రధానిని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

50వేల మంది వైద్య సిబ్బందికి నియామకానికి ఆదేశం
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్న రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సిబ్బందికి పని ఒత్తిడి తగ్గించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50వేల మంది ఎంబీబీఎస్ పూర్తి చేసి సిద్ధంగా ఉన్న అర్హులైన వైద్యుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని నిర్ణయించారు. రెండు, మూడు నెలల కాలానికి డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బందిని తక్షణమే నియమించుకోవాలని, కరోనా వైద్యంలో వారి సేవలను వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ వైద్యాధికారులను ఆదేశించారు. అంతేగాక, వీరికి గౌరవ ప్రదమైన రీతిలో జీతాలు అందించాలని అన్నారు.
వీరందరికీ కరోనా వంటి కీలక సమయంలో రాష్ట్రం కోసం పనిచేస్తున్నందున వారి సేవలకు సరైన గుర్తింపునివ్వాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వారికి వెయిటేజీ మార్కులను కలపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
కష్టకాలంలో ప్రజల కోసం సేవ చేయడానికి ముందుకు రావాలని సీఎం కేసీఆర్ యువ డాక్టర్లకు పిలుపునిచ్చారు.
https://odls.telangana.gov.in/medicalrecruitment/Home.aspx. డాక్టర్లతోపాటు అర్హత ఉన్న నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు.

సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు.. 729 మంది వైద్య సిబ్బంది నియామకం
వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను తక్షణమే ప్రారంభించాలని, వైద్య సిబ్బందిని నియమించాలని కేసీఆర్ నిర్ణయించారు. కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్మించిన ఎంజీఎంకు చెందిన 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని, ఆదిలాబాద్ జిల్లా రిమ్స్‌లోని మరో 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని తక్షణమే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
సీఎంఎస్ఎస్‌వై కింద ఎంజీఎంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ నిర్మాణానికి ప్రభుత్వ వాటా కింద తక్షణం అందజేయాల్సిన 8 కోట్ల రూపాయలను, రిమ్స్‌లో ఇదే పథకం కింద నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రభుత్వ వాటా కింద 20 కోట్ల రూపాయలను, మొత్తం 28 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు.
అంతేగాక, వరంగల్ ఆస్పత్రి కోసం 363 మంది వైద్య సిబ్బందిని, ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం 366 మంది వైద్య సిబ్బందిని, మొత్తం 729 మంది సిబ్బంది నియామకానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications