సీఎం కేసీఆర్ కుటుంబంలో విషాదం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబంలో విషాదం నెలకొంది. కేసీఆర్ రెండవ సోదరి భర్త పర్వతనేని రాజేశ్వర్ రావు(84) అనారోగ్యంతో శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిమడ్ల వాస్తవ్యులు.

రాజేశ్వర్ రావు మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతికి గురయ్యారు. అల్వాల్ మంగాపురిలో రాజేశ్వర్ రావు పార్థీవదేహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. రాజేశ్వర్ రావు మృతిపై సమాచారం అందిన వెంటనే మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు అక్కడికి చేరుకున్నారు.

రాజేశ్వర్ రావు పార్థీవదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. ఇతర టీఆర్ఎస్ నేతలు, బంధువులు రాజేశ్వర్ రావు మృతి పట్ల సంతాపం తెలిపారు.
శనివారం సాయంత్రం అల్వాల్ లోనే రాజేశ్వర్ రావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications