కరోనా నుంచి వేగంగా కోలుకున్న సీఎం కేసీఆర్... ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల్లో నెగటివ్...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్టుల్లో ఆయనకు కరోనా నెగటివ్‌గా నిర్దారణ అయింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల ఫలితాలు ఏప్రిల్ 29న రానున్నాయి. ప్రస్తుతం ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కేసీఆర్ వేగంగా కోలుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఏప్రిల్ 14న సీఎం కేసీఆర్ నాగార్జున సాగర్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. కేసీఆర్, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ సహా ఈ సభలో పాల్గొన్న పలువురు నేతలు కరోనా బారినపడ్డారు. ఈ నెల 19న కేసీఆర్‌కు స్వల్ప లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు నేత్రుత్వంలోని వైద్య బృందం కరోనా టెస్టులు నిర్వహించింది.

యాంటిజెన్ టెస్టులో పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్లి ఐసోలేషన్‌లో ఉంటున్నారు.ఆ తర్వాత కొద్దిరోజులకు యశోదా ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు నెగటివ్ వచ్చినప్పటికీ... ఆర్టీపీసీఆర్ టెస్టుల ఫలితాలు వచ్చేవరకూ హోం ఐసోలేషన్‌లో ఉండనున్నారు.
ప్రస్తుతం మంత్రి కేటీఆర్,టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ కరోనా నుంచి కోలుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నప్పటికీ తన దృష్టికి వచ్చే కరోనా బాధితుల సమస్యల పట్ల కేటీఆర్ తక్షణం స్పందిస్తున్నారు. అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశిస్తున్నారు. ఇటీవల విజయవాడకు చెందిన ఓ యువకుడు తన సోదరికి రెమ్‌డెసివర్ డ్రగ్ అవసరం ఉందని మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. స్పందించిన కేటీఆర్.. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మీకు సాయం అందిస్తారని ట్విట్టర్‌లో వారికి రిప్లై ఇచ్చారు. మంత్రి గౌతమ్ రెడ్డి వారికి అవసరమైన సాయం అందించారు.తెలంగాణ, ఆంధ్రా అన్న తేడా లేకుండా ఆపదలో ఉన్నవారికి తానున్నానని కేటీఆర్ భరోసా ఇస్తున్నారంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications