తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ తిరుపతి టూర్ వాయిదా, అందుకేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తిరుపతి పర్యటన వాయిదా పడింది. మరో వైపు రథసప్తమి ఏర్పాట్లలో టిటిడి అధికారులు బిజీగా ఉండడంతో పాటు, ఖమ్మం పర్యటన కారణంగా తిరుపతి పర్యటననను కెసిఆర్ వాయిదా వేసుకొన్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

తిరుపతి: తెలంగాణ ముఖ్యమంత్రి తిరుపతి పర్యటన వాయిదా పడింది. టిటిడి అధికారులు రథసప్తమి వేడుకల ఏర్పాట్లలో బిజీగా ఉన్నందున కెసిఆర్ తన పర్యటనను వాయిదావేసుకొన్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే వెంకన్నకు కానుకలను సమర్పిస్తానని ఉద్యమ సమయంలో కెసిఆర్ మొక్కుకొన్నారు.

అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది.అయితే ఈ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తన మొక్కులను తీర్చుకొనేందుకు మంత్రివర్గం ఆమోదం కూడ తెలిపింది.

telangana cm kcr tirupati tour postponed

ఈ మేరకు వెంకన్నకు సాలగ్రాహ హారం, కంఠాభరణం తయారు చేయించారు కెసిఆర్, ఉద్యమ సమయంలో 2010లో కెసిఆర్ మొక్కుకొన్నారు.

శ్రీవారికి కానుకలను తయారు చేశారు . మొత్తం ఆభరణాల బరువు 18,850 కిలోలు, అందులో 3.70 కోట్లు, విలువజేసే 14.20 కిలోలు సాలగ్రాహ హారం తయారు చేయించారు.

కోయంబత్తూరులోని కీర్తిలాల్ కాళిదాస్ కంపెనీ తయారుచేసింది. టిటిడి అధికారులు రథసప్తమి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. మరో వైపు ఖమ్మం జిల్లాలో భక్త రామదాసు ప్రాజెక్టును ప్రారంభోత్సవ పనులు చేసేందుకు కెసిఆర్ ఖమ్మం జిల్లాకు పర్యటనకు వెళ్తున్నారు.

దీంతో రథసప్తమితో పాటుగా ఖమ్మం జిల్లా పర్యటన నేపథ్యంలో కెసిఆర్ తిరుపతి పర్యటన వాయిదా పడింది.అయితే కెసిఆర్ ఎప్పుడు తిరిగి వస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

English summary
telangana cm kcr tirupati tour postponed for various reasons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X