కరీంనగర్‌కు సీఎం కేసీఆర్...?-ఆపరేషన్ హుజురాబాద్‌కు రంగంలోకి గులాబీ బాస్...?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 7న కరీంనగర్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కరీంనగర్ సివిల్ ఆస్పత్రిని ఆయన సందర్శించనున్నట్లు సమాచారం. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆయన ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. అనంతరం స్థానిక వైద్యాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.ఈటల రాజేందర్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచుతున్న వేళ కేసీఆర్ కరీంనగర్ పర్యటనకు వెళ్తుండటం చర్చనీయాంశంగా మారింది.

జిల్లా నేతలతో సమావేశమయ్యే ఛాన్స్...
గత నెలలో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి,వరంగల్ ఎంజీఎం ఆస్పత్రులను ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడ కోవిడ్ పేషెంట్లతో స్వయంగా మాట్లాడిన సీఎం... వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఇదే క్రమంలో కరీంనగర్‌లోనూ పర్యటించి జిల్లాలో కరోనా బాధితుల కోసం చేపడుతున్న చర్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. తాజా పర్యటనలో ఆయన జిల్లాలోని కీలక నాయకులతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఈటల వ్యవహారంపై ఇందులో ప్రధానంగా చర్చించవచ్చు.

ఆపరేషన్ హుజురాబాద్‌పై ఫోకస్
టీఆర్ఎస్ సభ్యత్వానికి,ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా ప్రకటించిన నేపథ్యంలో... ఆపరేషన్ హుజురాబాద్‌పై గులాబీ బాస్ మరింత ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది. ఇప్పటికే హుజురాబాద్‌లో కింది స్థాయి కార్యకర్తలు మొదలు టీఆర్ఎస్ నాయకులెవరూ జారిపోకుండా కేసీఆర్ పక్కాగా పావులు కదుపుతున్నారు. మంత్రి గంగుల కమలాకర్ కొద్దిరోజులు హుజురాబాద్‌లోనే మకాం వేసి ఈటల వర్గాన్ని బలహీనపర్చే ప్లాన్ అమలుచేశారు. ఉపఎన్నిక ముగిసేవరకూ నియోజకవర్గంపై పార్టీ పట్టు సడలకుండా ఉండేలా గులాబీ బాస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
Recommended Video

పదునైన వ్యూహాలు రచించనున్న గులాబీ బాస్
ఇప్పటివరకూ కేసీఆర్‌ను వీడి బయటకు వెళ్లిన నేతలెవరూ రాజకీయాల్లో మనగలిగిన దాఖలా లేదు. ఇప్పుడు ఈటల విషయంలోనూ ఇదే నిరూపితం కావాలని భావిస్తున్నారు. హుజురాబాద్ ఉపఎన్నికను ఆయన అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. కరీంనగర్ పర్యటనలో... ఆపరేషన్ హుజురాబాద్ వ్యూహాలకు మరింత పదును పెట్టే అవకాశం ఉంది. హుజురాబాద్‌ను పూర్తిగా టీఆర్ఎస్ దిగ్బంధనం చేసేలా... ఈటలకు ఎక్కడా ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా పార్టీ దూసుకెళ్లేలా గులాబీ బాస్ మార్గనిర్దేశం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద కేసీఆర్ కరీంనగర్ పర్యటన తర్వాత హుజురాబాద్ రాజకీయం మరింత రక్తి కట్టే అవకాశం లేకపోలేదు.












Click it and Unblock the Notifications