తెలంగాణాలో కోటి ఓట్లను తొలగించే కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
తెలంగాణలో సర్ ప్రక్రియలో భాగంగా వెరిఫికేషన్ కొనసాగుతుంది. నోటీసులు ఇచ్చిన వారిని విచారించి వారి ఓట్లను పరిశీలిస్తున్నారు.అయితే దీనిపై తాజాగా తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి సంచలనవ్యాఖ్యలు చేశారు. తెలంగాణా రాష్ట్రంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల సవరణ SIR ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటర్ల జాబితా సవరణ పేరుతో లక్షలాది మంది ఓటర్లను తొలగించే కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు
వారి ఓట్లను తొలగిస్తున్న కేంద్రం : సీఎం రేవంత్ ఆరోపణ
సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ ఇదివరకు మహారాష్ట్ర, బిహార్, పశ్చిమ బెంగాల్‌లో ఇలాంటి వ్యూహం అనుసరించి గెలుపు సాధించిందని, ఇప్పుడు తెలంగాణలోనూ అదే పద్ధతిని అనుసరిస్తోందని అన్నారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న ఓట్లను, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగిస్తున్నారని ఆరోపించారు.

దాదాపు 92 లక్షల మంది ఓటర్లు పరిశీలనలో .. సీఎం ఆందోళన
ఎన్నికల సంఘం విడుదల చేసిన డ్రాఫ్ట్ జాబితా ప్రకారం దాదాపు 73.39 లక్షల ఓటర్ల పేర్లు Absent, Shifted, Dead, Duplicate (ASDD) వర్గాల కింద ఉన్నాయి. మరో విభాగంలో అసాధారణతలు, అన్‌మ్యాప్డ్ ఎంట్రీలుగా గుర్తించిన వారి సంఖ్య కలిపి దాదాపు 92 లక్షల మంది ఓటర్లు పరిశీలనలో ఉన్నారన్నారు. ఇది రాష్ట్ర మొత్తం ఓటర్లలో మూడో వంతు వరకు ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో ఈడీ, సీబీఐ.. ఇప్పుడు సర్ తో ఇబ్బంది
చిన్న చిన్న తప్పులను సాకుగా చూపి పేద ప్రజల ఓట్లను తొలగిస్తున్నారని, బీఆర్ఎస్ కూడా బీజేపీకి అండగా నిలుస్తోందని ఆయన ఆరోపించారు. గతంలో ఈడీ, సీబీఐ వంటి సంస్థలను ఉపయోగించి ప్రత్యర్థులను ఇబ్బందిపెట్టిన బీజేపీ ఇప్పుడు ఓట్ల తొలగింపు వ్యూహానికి పాల్పడుతోందన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే ప్రతి బూత్ స్థాయిలో బూత్ లెవల్ ఏజెంట్లతో సమన్వయం చేసుకొని అర్హులైన ఓటర్లు తొలగించబడకుండా చూడాలని సీఎం రేవంత్ పార్టీ కార్యకర్తలకు సూచించారు.
కాంగ్రెస్ కార్యకర్తలు నిశ్శబ్దంగా ఉండరన్న సీఎం రేవంత్
తన కొడంగల్ నియోజకవర్గంలో 80 వేల ఓట్లు తొలగిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. గ్రామాల్లో, ప్రతి పోలింగ్ బూత్‌లో నాయకులు బాధ్యత తీసుకోవాలని, వలస వెళ్లిన వారి ఓట్లు కూడా రక్షించాలని కోరారు. ఓటు హక్కు రక్షణ అందరి బాధ్యత అని నొక్కి చెప్పిన సీఎం, బీజేపీ బ్యాక్‌డోర్ వ్యూహాలకు తావు ఇవ్వబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలు నిశ్శబ్దంగా ఉండరని, ఓటర్ల హక్కులను కాపాడేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications
