ఎయిర్‌పోర్ట్ మెట్రోపై సీఎం రేవంత్ కీలక ప్రకటన: ఇలా రూట్ మార్పుతో తక్కువ ఖర్చు

హైదరాబాద్: ఎయిర్‌పోర్ట్ మెట్రో, ఫార్మా సిటీని రద్దు చేయట్లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే మెట్రో దూరం తగ్గిస్తామని చెప్పారు. బీహెచ్ఈఎల్ నుంచి విమానాశ్రయానికి 32 కి.మీ దూరం ఉంటుందన్నారు. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా విమానాశ్రయానికి మెట్రో మార్గం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు.

నాగోల్ నుంచి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట వద్ద విమానాశ్రయానికి వెళ్లే మెట్రో లైన్ కి లింక్ చేయనున్నట్లు సీఎం చెప్పారు. అవసరమైతే మియాపూర్ రామచంద్రపురం, మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామన్నారు సీఎం రేవంత్. తాము కొత్తగా ప్రతిపాదించబోతున్న మెట్రో కారిడార్లు గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఖర్చుతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే పూర్తవుతాయని రేవంత్ తెలిపారు.

Telangana CM Revanth Reddy clarifies on Airport metro project and pharma city

ఫార్మాసిటీ, రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ మధ్య జీరో కాలుష్యంతో ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్. ప్రత్యేక కస్టర్ల వద్ద పరిశ్రమల్లో పనిచేసే వారికి ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. కార్మికులు హైదరాబాద్ వరకు రాకుండా అక్కడే అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. యువతకు అవసరమైన నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు.అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన సంస్థలు, ప్రముఖ పారిశ్రామికవేత్తల ద్వారా శిక్షణ ఉంటుందన్నారు. ఈ నైపుణ్యాలకు సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఉంటాయని సీఎం రేవంత్ తెలిపారు.

మరోవైపు, 100 పడకల ఆస్పత్రి ఉన్న వైద్యశాలలో నర్సింగ్ కళాశాల ఉంటుందన్నారు సీఎం రేవంత్. విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తామని తెలిపారు. ఆయా దేశాలకు అవసరమైన మ్యాన్ ​పవర్‌​ను ప్రభుత్వం ద్వారా అందిస్తామన్నారు. దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరుస్తామని సీఎం రేవంత్ వివరించారు.

ప్రెస్ అకాడమీ ఛైర్మన్ పదవిని భర్తీ చేసిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని సీఎం రేవంత్​ తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ల కమిషనర్లను నియమించానని సీఎం గుర్తు చేశారు. అయితే, వారికీ అవసరమైన ఉద్యోగాలను వారే భర్తీ చేసుకుంటారని తెలిపారు. శాఖలకు ప్రతిభ కలిగిన అధిపతులను నియమించే బాధ్యత తనదన్నారు. అధికార్ల నియామకాల్లో సామాజిక న్యాయం కూడా జరిగేలా చూస్తామన్నారు. తన వద్ద చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి ఉండదని రేవంత్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+