ఢిల్లీలో రేవంత్ రెడ్డి విందు... టీడీపీ, వైసీపీ హాజరు
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. నామినేటెడ్ పోస్టుల భర్తీతోపాటు రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చర్చించారు. అనంతరం తనతో నాలుగున్నర సంవత్సరాలు లోక్ సభలో కలిసివున్న ఎంపీలకు విందును ఏర్పాటు చేశారు. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు కూడా హాజరయ్యారు.
తెలుగుదేశం పార్టీ నుంచి గల్లా జయదేవ్, వైసీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, వేంరెడ్డి ప్రభాకరరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, బీద మస్తాన్‌రావు, వల్లభనేని బాలశౌరి, ఎస్.నిరంజన్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, వంగా గీత, పోచ బ్రహ్మానందరెడ్డి, గోరంట్ల మాధవ్, ఆదాల ప్రభాకరరెడ్డి, చింతా అనూరాధ, బీశెట్టి వెంకటసత్యవతితోపాటు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాణికం ఠాగూర్, కార్తీ చిదంబరం, రవ్‌నీత్ సింగ్ బిట్టూ, శశి థరూర్, గౌరవ్ గొగొయ్, దీపేందర్ హుడా, హిబి ఇడెన్ హాజరయ్యారు.

భారతీయ జనతాపార్టీ నుంచి సీఎం రమేశ్, టీఎంసీకి చెందిన సౌగత్ రాయ్, ఎన్‌సీపీకి చెందిన ప్రఫుల్ పటేల్, డీఎంకేకు చెందిన కళానిధి, బీఎస్పీకి చెందిన డానిష్ అలీ, రితేశ్ పాండే తదితరలు ఈ విందుకు వచ్చారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా కొత్త తెలంగాణ భవన్ ను నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్, ఏపీ భవన్ కు సంబంధించి, రెండు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ఆస్తుల విభజన పై ఆయన దృష్టిసారించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఢిల్లీలో మరికొన్ని అదనపు సౌకర్యాలను కూడా తీసుకురాబోతున్నట్లు తెలంగాణ భవన్ వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications