రేవంత్ రాజీనామా: మల్కాజిగిరి ప్రజలపై ఎమోషనల్ కామెంట్స్
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మల్కాజిగిరి లోక్‌సభ సభ్యత్వానికి రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లిన రేవంత్.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు తన రాజీనామా లేఖను సమర్పించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదకిగా ఆయన స్పందించారు. ఎంపీ పదవికి రాజీనామా చేశానని తెలిపారు. ఈ రాజీనామా తన ఎంపీ పదవికి మాత్రమేనని చెప్పారు.
తన మనసులో మల్కాజిగిరి ప్రజల స్థానం శాశ్వతమని రేవంత్ పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతకగా తనను పార్లమెంట్ కు పంపిన ఇక్కడి ప్రజలతో తన అనుబంధం శాశ్వతమన్నారు.చివరి శ్వాస వరకు అటు కొడంగల్.. ఇటు మల్కాజిగిరి తన ఊపిరి అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అంతకుముందు రేవంత్ రెడ్డి మల్కాజిగిర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.

'అప్రతిహత అధికారాన్నే అస్త్రంగా చేసుకుని.. అణచివేతనే మార్గంగా ఎంచుకుని, ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకే లేకుండా చేయాలని పాలకులు కక్షగట్టినప్పుడు.. తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రశ్నించే గొంతుకకు ప్రాణం పోసిన గడ్డ మల్కాజిగిరి. కొడంగల్‌లో పోలీసులు నా ఇంటిపై పడి, నన్ను నిర్బంధించడం చూసిన ఇక్కడి ప్రజలు ఆరు నెలలు తిరగకముందే నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. ప్రశ్నించే గొంతుకగా మార్చి తెలంగాణ మొత్తానికి రక్షణగా నిలబెట్టింది. ఈ ప్రాంతం ఈరోజు మీ రేవంత్ అన్న సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డపై జెండా ఎగరేసిందంటే దానికి పునాదులు పడింది మల్కాజిగిరిలోనే' అంటూ రేవంత్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
తన రాజకీయ ప్రస్థానంలో కొడంగల్‌కు ఎంటి ప్రాధాన్యత ఉందో.. మల్కాజిగిరికి అంతే ప్రాధాన్యం ఉందన్నారు. తనను దేశానికి పరిచయం చేసిన ఘనత మల్కాజిరి ప్రజలదేనని వ్యాఖ్యానించారు. ఏ విశ్వాసంతో, ఏ అభిమానం నన్ను గెలిపించారో ఎంపీగా ఐదేళ్లు ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేశానని తెలిపారు. విస్తృత బాధ్యత నేపథ్యంలో వ్యక్తిగతంగా కొన్నిసార్లు అనుకున్నంత సమయం కేటాయించలేకపోయానని రేవంత్ తెలిపారు. అలాంటి సందర్భంలో తన పరిస్థితిని మీరు సహృదయంతో అర్థం చేసుకున్నారన్నారు. తల్లి తన బిడ్డను దేశ రక్షణ కోసం పంపినట్లు.. తనను మీరు తెలంగాణ రక్షణ కోసం గెలిపించి పంపారని రేవంత్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్బంగా మల్కాజిగిరి ప్రజలకు పేరు పేరునా తన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు రేవంత్. ఈ ఐదేళ్లే కాదు.. ఇకపై మీతోనే నా అనుబంధం.. నా గుండెల్లో మీ స్థానం శాశ్వతం. మల్కాజిగిరి ప్రాంతం.. ఇక్కడి ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు రేవంత్. నాడు మీరు పోసిన ఊపిరి.. నా చివరి శ్వాస వరకూ తెలంగాణ ఉజ్వల భవిత కోసం తపిస్తూనే ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications