తెలంగాణ ఆదాయం పెంపుపై సీఎం రేవంత్ ఆదేశాలు: వాటిపైనే ఫోకస్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంపు మార్గాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. భూముల మార్కెట్ విలువలు సవరించాలని సూచించారు. మార్కెట్ విలువను శాస్త్రీయంగా నిర్ధరించాలన్నారు. మరోవైపు, అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు.

వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్ సూచించారు. అవసరమైన సంస్కరణలు చేపట్టాలని ఆదేశించారు. శాఖాపరమైన లొసుగులు లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

Telangana cm revanth reddy review on increasing state revenue

రాష్ట్రానికి ప్రదానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సచివాలయంలో సమావేశమయ్యారు. గత సంవత్సరం వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదని సీఎం రేవంత్ ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇకపై ప్రతిప నెలా ఆదాయ పెంపును సమీక్షించుకోవాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్. బడ్జెట్ లో పొందుపర్చిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏ నెలకు ఆ నెల లక్ష్యాలను నిర్దేశించుకుని రాబడి సాధించేందుకు కృషి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రధానంగా రాష్ట్రానికి రాబడి తెచ్చిపెట్టే జీఎస్టీ ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.

జీఎస్టీ రాబడి పెంచేందుకు ఎంతటివారైనా ఉపేక్షించకుండా, నిక్కచ్చిగా పన్ను వసూలు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. వాణిజ్య శాఖలో ఇంతకాలం జరిగిన పొరపాట్లు పునరావృతం కావద్దని స్పష్టం చేశారు. జీఎస్టీ రిటర్న్ పేరిట వెలుగులోకి వస్తున్న అవినీతి అక్రమాకు తావులేకుండా చూడాలని సీఎం రేవంత్ అప్రమత్తం చేశారు. అక్రమ మద్యం రవాణా, పన్ను ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.

హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలో అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, కానీ, అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని ప్రస్తావించారు. చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు, వాస్తవ క్రయ విక్రయాల రేట్లకు పొంతన లేకపోవడం ప్రధాన కారణమని చర్చించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే స్టాంప్ డ్యూటీ ఎంత మేరకు ఉంది.. తగ్గించాలా? పెంచాలా? అనే అంశంపై కూడా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. ఇక, ఇసుక ద్వారా వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను, లీకేజీలను అరికట్టాలని సీఎం రేవంత్ ఆదేశించారు.

వర్షాలపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌​తో పాటు వర్షం పడుతున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. సచివాలయం నుంచి అన్ని విభాగాల అధికారులతో సీఎం మాట్లాడారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+