Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..? - ఢిల్లీలొ సీఎం రేవంత్ మంత్రాంగం..!!

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పైన ముఖ్యమంత్రి రేవంత్ కసరత్తు చేస్తున్నారు. రేవంత్ ఢిల్లీ వెళ్లారు. కొత్తగా మంత్రివర్గంలో తీసుకొనే వారి అంశంతో పాటుగా 11 మంది మంత్రుల శాఖలపై కాంగ్రెస్‌ పెద్దలతో రేవంత్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. 11 మంది మంత్రుల శాఖలపై ఈరోజు సాయంత్రం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తిరిగి ఈరోజు రాత్రికి హస్తిన నుంచి రేవంత్ తిరుగు ప్రయాణం అవుతారు. రేపు మంత్రి వర్గ విస్తరణకు ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

ఢిల్లీకి సీఎం రేవంత్ : తెలంగాణ కేబినెట్ లో 18 మందికి అవకాశం ఉంది. ఇప్పటికే సీఎంతో సహా 12 మంది ఉన్నారు. మరో ఆరుగురి నియమాకం పైన ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కానుంది. కొత్త స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ గా ఖరారైన అక్బరుద్దీన్ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అదే విధంగా కాంగ్రెస్ హామీ ఇచ్చిన గ్యారెంటీ పథకాల్లో రెండు స్కీంలను రేపు సోనియా జన్మదినం సందర్బంగా ప్రారంభించనున్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం.. రూ 10 లక్షలకు ఆరోగ్య శ్రీ పెంపు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో రేవంత్ రేపు పూర్తి స్థాయి ప్రభుత్వం ఏర్పాటు కావాలని కోరుకుంటున్నారు.

Telangana CM Revanth Reddy to finalise the cabinet Expansion in his Delhi Tour

కేబినెట్ విస్తరణ - శాఖలు : సోనియా జన్మదినం నాడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని గతంలోనే రేవంత్ చెప్పుకొచ్చారు. అయితే, 7వ తేదీన సీఎం గా రేవంత్.. మరో 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసారు. ఇక, ఈ నెల 9న పూర్తి స్థాయి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు ఢిల్లీలో పార్టీ పెద్దలతో చర్చించి..మిగిలిన ఆరుగురు మంత్రులకు ఆమోదం తీసుకోవటంతో పాటుగా మంత్రుల శాఖలను ప్రకటించనున్నారు. నిజామాబాద్, అదిలాబాద్, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సి ఉంది. ఉమ్మడి రంగారెడ్డి నుంచి స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరు దాదాపు ఖరారు అయ్యింది. అదే విధంగా ముస్లిం మైనార్టీ వర్గం నుంచి షబ్బీర్ అలీకి స్థానం ఖాయమని ప్రచారం సాగుతోంది. హైదరాబాద్ నుంచి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఇద్దరినీ ఎమ్మెల్యేలుగా చేయాల్సి ఉంటుంది.

Telangana CM Revanth Reddy to finalise the cabinet Expansion in his Delhi Tour

సోనియా జన్మదినం స్పెషల్ : జీ వినోద్, ప్రేమ సాగర్ రావు సైతం మంత్రి పదవుల కోసం హైకమాండ్ ను కలిసారు. దీంతో..అసలు మిగిలిన ఆరు మంత్రి పదవులు ఎవరికి ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది. ప్రస్తుతం బాధ్యతలు స్వీకరించిన మంత్రులతో పాటుగా కొత్త మంత్రుల శాఖలను ఈ పర్యటనలో రేవంత్ ఖరారు చేస్తారని సమాచారం. సోనియా జన్మదినం సెంటిమెంట్ గా భావిస్తున్న రేవంత్ అసెంబ్లీ సమావేశాలు..పూర్తి స్థాయి ప్రభుత్వం..గ్యారంటీల అమలు ద్వారా ప్రత్యేకంగా ఈ రోజు నిలిచిపోవాలని భావిస్తున్నారు. దీంతో..రేపే మంత్రివర్గ విస్తరణ ఉంటుందా..లేదా అనేది తేలాల్సి ఉంది. అసెంబ్లీ వేదికగా తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ శ్వేత పత్రం విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+