తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్..

తెలంగాణలో దాదాపు 2 లక్షల మందికి పైగా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధిదారుల సంఖ్య 3 కోట్లు దాటినట్లు ఇటీవల వెల్లడైంది. అయితే రేవంత్ సర్కార్ తాజాగా కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 14న సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల పంపిణీ చేపట్టనున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

తెలంగాణలోని కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. జులై 14 న సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల పంపిణీ చేపట్టనున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 2 లక్షలకు పైగా లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే అర్హత పొందినవారి దరఖాస్తుదారుల జాబితా సిద్ధమైనట్లు సమాచారం. ఇక కొత్త రేషన్ కార్డు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్న కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంతో భారీ ఊరట లభించింది.

Telangana CM Revanth Reddy to Launch New Ration Card Distribution on July 14 in Tungaturthi

జులై 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుంగతుర్తిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. తొలి విడతలో 2 లక్షలకు పైగా లబ్ధిదారులకు కార్డులు అందించనున్నారు. ప్రజా పాలన, మీ-సేవ దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. ఈసారి స్మార్ట్ రేషన్ కార్డులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు తెలిపారు. ఈ స్మార్ట్ కార్డులు ఏటీఎం కార్డు సైజులో ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఈ రేషన్ కార్డుకు ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో, మరొక వైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఉండనున్నట్లు సమాచారం. అలాగే కార్డు మధ్య భాగంలో తెలంగాణ ప్రభుత్వం లోగో ఉండేలా డిజైన్ చేసినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+