Video:కేసీఆర్ డూప్‌ను దించిన కాంగ్రెస్..నవ్వులే నవ్వులు..!

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. ప్రచార జోరు పెరిగింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి.

తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. రాజెవరు? బంటు ఎవరు? అనేది తేలిది అప్పుడే.

Telangana Congress launches its satirical campaign against BRS

ఈ క్రమంలో విజయం సాధించడానికి అన్ని ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. త్రిముఖ పోటీ నెలకొంది ఇక్కడ. అధికార భారత్ రాష్ట్ర సమితి, ప్రతిపక్ష కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఎన్నికల సమర శంఖాన్ని పూరించాయి. అటు పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన కూడా ఎన్నికల బరిలో నిలిచింది. బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తోంది.

ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఇదివరకు కాళేశ్వరం ఏటీఎం పేరుతో అధికార బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టిన తెలంగాణ కాంగ్రెస్.. ఇప్పుడు తన ఒరలో నుంచి మరో అస్త్రాన్ని బయటికి తీసింది.

మార్పు కావాలి- కాంగ్రెస్ రావాలి.. పేరుతో ఓ సెటైరికల్ క్యాంపెయిన్ తెర తీసింది. 40 సెకెన్ల నిడివి ఉండే ఓ షార్ట్ వీడియోను రూపొందించింది. కేసీఆర్ డూప్‌ను రంగంలోకి దించింది. కేసీఆర్ నిర్వహించే ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలను పోలిన విధంగా సెటప్ చేసింది.

Telangana Congress launches its satirical campaign against BRS

కాళేశ్వరం, ధరణి పోర్టల్, ఇంటింటికీ నల్లా, ఉద్యోగాలు.. వంటి అంశాలను ఇందులో ప్రస్తావించింది. కేసీఆర్ డూప్ ప్రసంగిస్తోండగా.. వాటికి పక్క నుంచి కౌంటర్లు ఇస్తోండటం ఈ క్యాంపెయిన్ ప్రత్యేకత. ఇదివరకు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ప్రచారాలను చేపట్టింది. అది సక్సెస్ అయింది.

దీనితో అదే ఫార్ములాను ఇక్కడా అనుసరిస్తోంది కాంగ్రెస్. ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలు- ఈ ఐడియా వెనుక ఉన్నారు. ఆయనే ఈ తరహా సెటైరికల్ క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టారని, దీనికి మంచి స్పందన వస్తోందని, గ్రామగ్రామాన దీన్ని ప్రదర్శిస్తామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+