తెలంగాణలో ముందస్తు ఎన్నికలు..బీజేపీ,టీఆర్ఎస్‌లకు మెగా కృష్ణారెడ్డి ఇన్ కం సోర్స్..జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2023 ఫిబ్రవరిలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు వెళ్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ నేత తీరు వవ్వులాటాలా ఉందని విమర్శించారు. వరి పంచాయతీ తెచ్చిందే కేంద్రంలోని బీజేపీ అని దుయ్యబట్టారు. రాజకీయంగా ఎదిగేందుకు కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ , టీఆర్ఎస్ పార్టీలకు ప్రధాన ఇన్ కం సోర్ట్ మెగా కృష్ణారెడ్డి అని ఆరోపణలు గుప్పించారు.

నవంబరులో కేసీఆర్ ప్రభుత్వం రద్దు
తెలంగాణలో ముందుస్తు అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో సీఎం కేసీఆర్ తన ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని పేర్కొన్నారు. ఫిబ్రవరి 2023లో ముందస్తు ఎన్నికలు రానున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికల కోసం వ్యూహత్మకంగా కేసీఆర్ అన్ని సమకూర్చుకుంటున్నారని చెప్పారు. పార్టీ నేతలకు కూడా ఇప్పటికే పలు సూచలు చేశారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

దేశంలో సమస్యలకు బీజేపీయే కారణం
బీజేపీ, టీఆర్ఎస్ నేతల తీరుపై జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. దేశంలో బీజేపీ సమస్యలు సృష్టిస్తోందని విమర్శించారు. చేయని పనిని కూడా చేస్తున్నట్లు భ్రమ కల్పించడంలో బీజేపీ దిట్ట అని మండిపడ్డారు. ఇచ్చిన వాగ్ధానాలను పక్కన పెట్టి రాజకీయంగా, మత పరంగా రెచ్చగొడుతూ పబ్బం గడుపుతోందని దుయ్యబట్టారు. అధికారంలోకి దొడ్డిదారిన ఎలా రావాలి.. రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలను ఎలా దెబ్బకొట్టాలన్న దానిపై ప్రధానంగా బీజేపీ దృష్టి పెట్టిందన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలోక తొక్కిందని దుయ్యబట్టారు.

బీజేపీ నేతల తీరు నవ్వులాటలా ఉంది..
తెలంగాణలో హీనవైన రాజకీయం బీజేపీ చేస్తోందని జగ్గారెడ్డి విరుచుపడ్డారు. రాష్ట్రంలో వరి పంచాయితీని తెచ్చిందే కేంద్రంలోని బీజేపీయని విమర్శించారు. 317 జీవో చిచ్చుకు కారణం కేంద్రమే అని దుయ్యబట్టారు. తాను చేయాల్సిన పనిచేయకుండా ప్రజల మధ్య ఉద్వేగాలు రెచ్చగొడుతుందని ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ నేతలు విచిత్రమైన ఉద్యమాలు చేస్తున్నారు. వారి తీరు నవ్వులాటలా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీకి ప్రజా బలం లేదని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను తెలంగాణలోకి తీసుకువచ్చి మీడియా ద్వారా హైఫ్ క్రియేట్ చేస్తున్నారని విమర్శించారు.
Recommended Video

బీజేపీ, టీఆర్ఎస్‌కు మెగా కృష్ణారెడ్డి ఇన్ కం సోర్స్
రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు మెగా కృష్ణారెడ్డి ప్రధాన ఇన్ కం సోర్స్ అని జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వనరులను సమకూర్చుకొని కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో మెగా కృష్టారెడ్డి ద్వారా పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థులకు డబ్బులు ఖర్చు పెట్టించే ప్రయత్నాలను బీజేపీ చేస్తుందని ఆరోపించారు. ఇటీవల మెగా కృష్ణారెడ్డి కంపెనీలపై జరిగిన ఈడీ, ఐటీ దాడులకు సంబంధించిన వివరాలను బయటకు రాకుండా కమలం పార్టీ కుట్రచేస్తోందని ఆరోపించారు. 2004 సంవత్సరానికి ముందు మెగా కృష్ణారెడ్డి సాదారణ మారుతి కారులో తీరిగేవారు. అలాంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అతి తక్కువ కాలంలోనే వేలాది కోట్ల రూపాయలకు పడగలెత్తారని ఆరోపించారు. త్వరలోనే వీటన్నింటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications