నాడు వైఎస్సార్.. నేడు భట్టి విక్రమార్క: తెలంగాణ కాంగ్రెస్‌ ట్రేడ్ మార్క్

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది తెలంగాణ. దీనికి సంబంధించిన వేడి రాజుకుంటోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ఇక ఎంతో సమయం లేదు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. అధికార భారత్ రాష్ట్ర సమితికి చెక్ పెట్టడానికి కాంగ్రెస్ పావులు కదుపుతోంది.

ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంటోంది. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయాన్ని నిలువరించడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది. కర్ణాటక ఫార్ములాను అనుసరించేలా వ్యూహాలపై కసరత్తు సాగిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో చేరికలకూ అధిక ప్రాధాన్యత ఇస్తోంది.

Telangana Congress set to hold Jana Garjana meeting on July 2

ఇందులో భాగంగా- సీనియర్ నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావును పార్టీలో చేర్చుకోవడానికి అవసరమైన చర్యలన్నింటినీ పూర్తి చేసింది కాంగ్రెస్. ఇక వారి చేరిక లాంఛనప్రాయమే. జులై 2వ తేదీన ఖమ్మంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభ వేదికగా వారిద్దరూ కాంగ్రెస్ కండువాను కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ సభకు జన గర్జన అని పేరు పెట్టింది కాంగ్రెస్. తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభ ఇది. ఇదివరకెప్పుడూ లేనివిధంగా ఈ సభను నిర్వహించడానికి ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టింది. కనీసం అయిదు లక్షల మందిని సమీకరించాలనే లక్ష్యంగా పెట్టుకుంది.

Telangana Congress set to hold Jana Garjana meeting on July 2

మొత్తం 36 నియోజకవర్గాల్లో 1,221 కిలో మీటర్ల మేర భట్టి విక్రమార్క పాదయాత్ర చేశారు. పాదయాత్ర చివరి రోజున ఈ జన గర్జన సభను నిర్వహించాలని నిర్ణయించింది కాంగ్రెస్. అదే సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు జాయిన్ కానున్నారు. దీనికి రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. పాదయాత్రను చేపట్టిన భట్టిని రాహుల్ గాంధీ సన్మానిస్తారు.

ఇవ్వాళ భట్టి విక్రమార్కను తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావ్ థాకరే కలుసుకున్నారు. సభ ఏర్పాట్లపై మాట్లాడారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి సహా పలువురు సీనియర్ నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఖమ్మం సభ విధి విధానాలపై చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల సమరశంఖానికి ఈ సభను నాందిగా భావిస్తోన్నారు.

Telangana Congress set to hold Jana Garjana meeting on July 2

భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్వహించిన మహా ప్రస్థానాన్ని తలపిస్తోందనడంలో సందేహాలు అక్కర్లేదు. వైఎస్సార్‌ తరహాలోనే ఆయన గ్రామస్థాయి ప్రజలను ఆకట్టుకుంటోన్నారు. అవే హావభావాలను ప్రదర్శిస్తోన్నారు. భట్టి వస్త్రధారణ కూడా వైఎస్సార్‌ను తలపిస్తోంది. ప్రజలను పలకరించడంలో అదే ఆప్యాయతను కనపర్చుతున్నారు. దీంతో భట్టి విక్రమార్కే కాంగ్రెస్ నుంచి సీఎం అభ్యర్థి అవుతారా అన్న చర్చ ప్రజల్లో ప్రారంభమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+