Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గేర్ మార్చిన టీ కాంగ్రెస్ - బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ పై గురి..!!

తెలంగాణలో ఎన్నికల రాజకీయం రాజుకుంది. కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయమనే ధీమాతో ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ తమదే అధికారం అని విశ్వాసంతో ఉంది. ఈ సమయంలో ఎన్నికల ప్రచారంలో నేతల డైలాగ్ వార్ కొనసాగుతోంది. కాంగ్రెస్ ఈ సారి వినూత్నంగా ప్రచారం చేస్తోంది. వినూత్నంగా కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు హామీలు ఏ రకంగా విస్మరించిందీ వివరిస్తూ చేసిన వీడియోలకు ప్రచారంలో భారీ స్పందన కనిపిస్తోంది.

మారుతన్న ప్రచార సరళి : తెలంగాణలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరంది. సీఎం కేసీఆర్ ప్రతీ రోజు మూడు సభల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ అగ్ర నేతలు ప్రచారంలో బిజీ అయ్యారు. ఈ సమయంలోనే కాంగ్రెస్ సాధారణ ప్రజలను ఆకట్టుకొనే తరహాలో కొత్త విధానంలో ప్రచారం ప్రారంభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ..వారి పైన ప్రజల్లో వ్యతిరేకత మొదలైందనే విధంగా కళ్లకు కట్టినట్టుగా కాంగ్రెస్ డిజిటల్ ప్రచారం ప్రారంభించింది. ఈ ప్రచారంతో ఒక్క సారిగా మార్పు కనిపిస్తోంది. ఈ తరహా ప్రచారంలో బీఆర్ఎస్, బీజేపీ వెనుకంజలో ఉన్నాయి.

The Congress Miles ahead of BRS, BJP in election campaign in Telangana assembly elections

కాంగ్రెస్ వినూత్న ప్రచారం : తాజాగా కాంగ్రెస్ మార్పు కావాలి-కాంగ్రెస్ రావాలి పేరుతో రైతు సమస్యలు, బీఆర్ఎస్ వైఫల్యాలపై మరో వీడియో విడుదల చేసింది. బీఆర్ఎస్ పాలనలో జరిగిన 8 వేల రైతుల ఆత్మహత్యలు, రైతు రుణమాఫీ చేయడంలో వైఫల్యం,‌ఉచిత ఎరువుల హామీ, ధరణి దోపిడీ, ధాన్యం కొనుగోలు వంటి అంశాలపై వీడియో ను తయారు చేసింది. ఈ వీడియోలో రైతులు కారు పంక్షర్ చేయడం ఖాయమని చెబుతుండటం ద్వారా బీఆర్ఎస్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న రైతు వర్గాన్ని తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తోంది హస్తం పార్టీ. మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి పేరుతో చేస్తున్న ప్రచారానికి మంచి స్పందన కనిపిస్తోందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సోషల్ మీడియా ద్వారానూ కాంగ్రెస్ ఓటర్లను చేరుకొనే ప్రయత్నం చేస్తోంది.

బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ పై గురి : కాంగ్రెస్ పార్టీ ఇటీవల మొదలుపెట్టిన మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి ప్రచారంలో బాగంగా బీఆర్ఎస్ నమ్ముకున్న వర్గాలను దూరం చేసే ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తోంది. బీఆర్ఎస్ హయాంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ.. కాంగ్రెస్ వస్తేనే రైతుల జీవితాల్లో వెలుగులు అని చెబుతూ ప్రచారం కొనసాగిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వివరిస్తున్నారు. రుణమాఫీ మోసం చేసారని..ధరణీ పేరుతో భూములు లాక్కున్నారని ప్రచారంలో ప్రధానంగా చెబుతోంది. ఉచిత ఎరువులు అని రైతులను ఉరికొయ్యలు ఎక్కించారంటూ కేసీఆర్ లక్ష్యంగా ఈ ప్రచారం కొనసాగుతోంది. "పదేండ్ల అహంకారం పోవాలంటే.. పదేండ్ల అవినీతిని తరమాలంతే" .. "మార్పు కావాలి - కాంగ్రెస్ రావాలి" అనే నినాదం ప్రధానంగా కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+