Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారీ వర్షాలు: సీఎస్ శాంతి కుమారి సమీక్ష, కీలక ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సీఎస్ శాంతి కుమారి సూచించారు. అశ్వారావుపేట పెద్ద వాగు వరద పరిస్థితిపై సీఎస్ శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పరిసర గ్రామాల్లోని చెరువులు, కుంటలు తెగకుండా ముందస్తు చర్యలను చేపట్టాలని జిల్లా యంత్రాంగానికి సీఎస్ సూచించారు.

భద్రాద్రి కొత్తగూడెం లోని అశ్వరావుపేట పెద్దవాగుకు పెద్ద ఎత్తున వరద రావడం వల్ల గేట్లు ఎత్తడంతో దిగువ భాగంలోని గ్రామాల రైతులు వరద నీటిలో చిక్కుకున్న సంఘటనకై సీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎస్పీ, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.

Telangana CS Shanti Kumari review on heavy rain situation

డీజీపీ జితేందర్, విపత్తుల నిర్వహణ శాఖ డీజీ, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ కూడా పాల్గొన్న ఈ టెలీ కాన్ఫరెన్స్ లో సీఎస్ మాట్లాడుతూ.. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రాణనష్టం కలగవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారని చెప్పారు.

పెద్ద వాగుకు చెందిన 3 గేట్లు ఎత్తడంతో సమీపంలోని 4 గ్రామాలలోకి వరద నీరు ఒక్కసారిగా చేరడంతో వ్యవసాయ భూముల్లో నీటిలో చిక్కుకున్న 28మందిని రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ బృందాలు వెంటనే రంగంలోకి దిగి రెండు హెలికాప్టర్లతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించామని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.

మరో 20 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర రెస్క్యూ బృందాలు సహాయ పునరావాస కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నాయని అన్నారు. గుమ్మడివెళ్లి, కోయగూడెం, కొత్తూరు, గాజులపల్లి గ్రామాల ప్రజలను పునరావాస శిబిరాల్లోకి తరలించే ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ జితేష్ పేర్కొన్నారు.

ప్రజల ప్రాణాలు అత్యంత ప్రధానమని, హైదరాబాద్ నుండి ఏవిధమైన సహాయ సహకారాలు కావాలన్న అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎస్ స్పష్టం చేశారు. భారీ వర్షాల వల్ల ఒక్కసారిగా 40 వేల క్యూసెక్కుల వరద రావడంతో గేట్లు ఎత్తాల్సివచ్చిందని, ప్రస్తుతం వరద తగ్గిందని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా వివరించారు. సిఇ తో పాటు ఇతర సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారని అన్నారు. మరోవైపు, భారీ వర్షాలు, వరదల వల్ల సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించామని డీజీపీ జితెందర్ తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+