Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేపట్నుంచి రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ సొమ్ము జమ: ముందుగా చిన్నమొత్తాలు

హైదరాబాద్: రెండో దఫా రుణమాఫీతో రాష్ట్ర వ్యాప్తంగా 6,06,811 మంది రైతులకు లబ్ధి చేకూరనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. 50వేల రూపాయల్లోపు రుణాలున్న వారికి సోమవారం నుంచి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుందని తెలిపారు. ఇందుకోసం ఆదివారం నుంచి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

రూ. 25వేలపైన తక్కువ మొత్తం ఉన్న వారితో ప్రారంభించి నెలాఖరు వరకు యాభై వేల లోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. 25 వేల పైబడి 25,100 రూపాయల వరకు రుణం ఉన్న రైతుల రుణమాఫీపై ట్రయల్ జరుగుతుందని చెప్పారు. 25వేలు, 26వేలు, 27వేలు స్లాబుల వారీగా రుణమాఫీ మొత్తం రైతుల ఖాతాల్లో జమ అవుతుందని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

Telangana: debt waiver money in farmers accounts from tomorrow

ఆగస్టు నెలాఖరు వరకు 2005.85 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు. సోమవారం నుంచి రుణమాఫీ మొదలు కానున్న నేపథ్యంలో రైతులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో 2014 నుంచి 18 వరకు 16,144 కోట్ల రైతు రుణాలు మాఫీ అయ్యాయని మంత్రి చెప్పారు.

2018లో 25 వేలలోపు రుణాలున్న 2.96 లక్షల మంది రైతులకు 408.38 కోట్ల మేర మాఫీ అయిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు రాష్ట్ర రైతుల పక్షాన నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగానికి కేసీఆర్ వెన్నుదన్నుగా నిలచారని అన్నారు. ఆకలితో అలమటించిన తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా నిలిపారని మంత్రి వ్యాఖ్యానించారు. పంటల మార్పిడి వైపు రైతులను ప్రోత్సహించి తెలంగాణ వ్యవసాయాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తామన్నారు.

కాగా, సీఎం కేసీఆర్ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనూ తెలంగాణ వ్యవసాయం గురించి మాట్లాడారు. ఒకప్పుడు తెలంగాణ కరువుకాటకాలకు నిలయంగా ఉండేది. ప్రస్తుతం అదే తెలంగా ణ 2020-21 వ్యవసాయ సంవత్సరంలో మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు కలిపి 3.4 లక్షల టన్నుల దిగుబడిని సాధించి దేశంలో అగ్రభాగాన నిలిచింది. రాష్ట్ర జీడీపీలో 20 శాతం ఆదాయం వ్యవసాయ రంగం సమకూరుస్తున్నది. దండుగ అనుకున్న వ్యవసాయాన్ని ప్రభుత్వం పండుగలా మార్చింది అని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏముంటుంది అని సీఎం కేసీఆర్ అన్నారు.

Recommended Video

    Spl Coverage On Tpcc Revanth Reddy Challenge To Telangana Government || Oneindia Telugu

    ఉమ్మడి రాష్ట్రంలో మన అవసరాలకోసం, పేదలకు రేషన్ బియ్యం పంపిణీకోసం పంజాబ్ తదితర రాష్ట్రాల నుంచి బియ్యం దిగుమతి అయ్యేవి. అవి తినడానికి కూడా పనికొచ్చేవి కాదు. కానీ ఈ రోజు తెలంగాణ రైతన్నలు రాష్ట్రానికే కాదు, దేశంలోని ప్రజలందరికీ కడుపు నిండా అన్నం పెడుతున్నారు. తెలంగాణ 'రైస్ బౌల్ ఆఫ్ ఇండియా'గా అవతరించిందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+