మహిళా టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. !!
సావిత్రీబాయి ఫూలే 195వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె జయంతి రోజైన జనవరి 3వ తేదీని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకోనుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకలను నిర్వహించాలని ఆదేశించింది. దీనికి సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు.
మహిళల విద్యకు సావిత్రీబాయి ఫూలే అందించిన అపారమైన కృషికి నివాళి అర్పించడమే ఈ ప్రత్యేక దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం. ఈ వేడుకల్లో భాగంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుండి 10 మంది ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను గుర్తించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించారు.

ఈ ఆదేశాల మేరకు- జిల్లా కలెక్టర్లు, విద్యా శాఖ అధికారులు.. అన్ని ప్రభుత్వ పాఠశాలల నుండి హెడ్ మాస్టర్, స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, తత్సమాన కేడర్‌లలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. విద్యార్థులకు అత్యుత్తమ బోధనను అందించిన ప్రభుత్వ, మున్సిపల్, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పని చేస్తోన్న మహిళా ఉపాధ్యాయులను జిల్లాకు 10 మంది చొప్పున ఎంపిక చేయాలి. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (KGBV), మోడల్ పాఠశాలలను కూడా ఇందులో చేర్చారు.
ఆయా పాఠశాలల నుండి ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. ఎంపికైన మహిళా ఉపాధ్యాయులను జనవరి 3వ తేదీన జిల్లా స్థాయిలో ఘనంగా సన్మానించే కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, ఇతర ప్రముఖులను ఆహ్వానించాలని పాఠశాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ నవీన్ నికొలాస్ ఆదేశించారు. ఈ సన్మాన కార్యక్రమాలకు అవసరమైన నిధులను జిల్లా విద్యాశాఖాధికారుల వద్ద అందుబాటులో ఉన్న నిధుల నుండి సమకూర్చుకోవాలని పేర్కొన్నారు.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
లాస్ట్ ఛాన్స్: కేంద్రీయ విద్యాలయ సీట్లు, రేపే ఆఖరు గడువు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications