వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏప్రిల్ 27 నుంచి వేస‌వి సెల‌వులు -రేపే లాస్ట్ వర్కింగ్ డే -జూన్1లోపు కరోనా తగ్గితేనే స్కూళ్లు రీఓపెన్

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాదకరంగా మారడంతో ఇప్పటికే కొన్ని పరీక్షలు రద్దు చేసి, మరికొన్నింటిని వాయిదా వేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణలో ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం వెల్లడించారు.

రేవంత్ రెడ్డికి మోదీ సర్కార్ షాక్ -ఎంపీ సహా ఇంకొందరి ట్వీట్లు బ్లాక్ -కరోనాపై ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీస్తే..రేవంత్ రెడ్డికి మోదీ సర్కార్ షాక్ -ఎంపీ సహా ఇంకొందరి ట్వీట్లు బ్లాక్ -కరోనాపై ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీస్తే..

 సీఎం రివ్యూ.. వెంటనే నిర్ణయం..

సీఎం రివ్యూ.. వెంటనే నిర్ణయం..

కరోనా పరిస్థితులు, వేసవి కాలం, విద్యా సంస్థలు, పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సమీక్ష నిర్వహించారు. కొవిడ్ వ్యాధికి గురైన సీఎం తన ఫామ్ హౌజ్ నుంచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యా శాఖ అధికారులతో సమీక్ష చేశారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించి వేసవి సెలవులపై సీఎం సమీక్షించారని, ఆ వెంటనే నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి సబిత తెలిపారు.

 ఏప్రిల్ 26 లాస్ట్ వర్కింగ్ డే

ఏప్రిల్ 26 లాస్ట్ వర్కింగ్ డే

రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న‌ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేసినట్లు మంత్రి సబితా గుర్తు చేశారు. అదేవిధంగా 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53 లక్షల 79 వేల 388 మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ 27 నుంచి వేసవి సెలవులు మొదలుకానుండటంతో సోమవారం(ఏప్రిల్ 26వ తేదీని) ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి దినంగా పరిగణిస్తామని మంత్రి పేర్కొన్నారు. కాగా,

కరోనా తగ్గాకే స్కూళ్ల రీఓపెనింగ్..

కరోనా తగ్గాకే స్కూళ్ల రీఓపెనింగ్..

ఏప్రిల్ 27 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయని ప్రకటించిన ప్రభుతవం.. పాఠశాలలు, జూనియర్ కళాశాలలను తరువాత ఎప్పుడు తెరిచేదిమాత్రం స్పష్టంగా పేర్కొనలేదు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుదల, కోవిడ్ 19 పరిస్థితులకు అనుగుణంగా జూన్ 1న ప్రభుత్వం నిర్ణయిస్తుందని మంత్రి సబిత తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం తెలంగాణలో కొత్తగా 8126 కేసులు, 38 మరణాలు నమోదయ్యాయి. వాతావరణం పరంగా తెలంగాణలో వింత పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఎండలు విపరీతంగా కాస్తుండగా.. మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

షాకింగ్: ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలుడు -27మంది కొవిడ్ రోగులు దుర్మరణం, మరో 50 మందికిషాకింగ్: ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలుడు -27మంది కొవిడ్ రోగులు దుర్మరణం, మరో 50 మందికి

English summary
The Telangana State government has declared holidays for schools and junior colleges from April 27 to May 31. This was disclosed by Education Minister P. Savitha Indra Reddy as per the directions of the chief minister. She said Chief Minister K. Chandrashekhar Rao reviewed the situation with Chief Secretary Somesh Kumar and other education department officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X