రజినీకాంత్ కితాబు, అమెరికా ఇంజినీర్ల ప్రశంసలు: తెలంగాణ నెంబర్ 1 అంటూ కేటీఆర్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అత్యద్భుతంగా పురోగతి సాధించిందన్నారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. పర్యావరణం, పరిశ్రమల రంగాల్లో అద్భుతమైన ప్రగతి జరిగిందన్నారు.

తెలంగాణలో సమగ్ర, సమత్యులత,సమ్మిళిత అభివృద్ధి జరిగిందని వివరించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ గ్రీన్ ఇండీస్ట్రియల్ పార్క్‌లో జరిగిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో పాల్గొని ప్రసంగించారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.

Telangana developing in every sector under the rule of CM KCR: minister KTR in Yadadri district visit

పరిశ్రమల ఏర్పాటు లో అత్యంత పారదర్శకంగా అనుమతులు ఇస్తున్న రాష్ట్రం మన తెలంగాణ అని కేటీఆర్ స్పష్టం చేశారు. టీఎస్ ఐపాస్ విధానంలో 15 రోజుల్లో అనుమతులు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. అమెరికాలో కూడా ఇలాంటి విధానం లేదు అని అక్కడి పారిశ్రామిక వేత్తలు చెప్పారు.

మానవ చరిత్రలో మూడవ అతి పెద్ద కార్యక్రమం మన హరితహారం కార్యక్రమం. భవిష్యత్ తరాలకు పచ్చటి వాతావరణం అందిస్తున్నాం. పల్లె పాలనలో 30 జాతీయ స్థాయి అవార్డులు మన పల్లెలు సాధిస్తున్నాయి. పట్టణాలు కూడా జాతీయ అవార్డు లు అందుకుంటున్నాయి. అని కేటీఆర్ వెల్లడించారు.

Telangana developing in every sector under the rule of CM KCR: minister KTR in Yadadri district visit

తెలంగాణలో మారు మూల గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా ఇవ్వాళ సంతోషంగా ఉన్నరు. తెలంగాణను అవహేళన చేసిన వాళ్ళు కనుమరుగయ్యారు. సూపర్ స్టార్ రజినీకాంత్ హైదరాబాద్‌ని పొగిడారు. ఆయన ఎన్నో దేశాలు తిరుగుతారు. మన హైదరాబాద్ అత్యద్భుతంగా అభివృద్ధి జరిగిందని రజినీ కితాబు ఇచ్చారు అని కేటీఆర్ తెలిపారు. గుజరాత్ రాష్ట్రంలో ఈ రోజుకు కూడా కరంట్ కోతలు ఉన్నాయన్నారు. పక్క రాష్ట్రాల్లో వెళ్లి ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసుకోండి అని అన్నారు.

పచ్చదనంకి మారు పేరు తెలంగాణ. గ్రీన్ బడ్జెట్ పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. నెక్ట్స్ జనరేషన్ గురించి ఆలోచించే ముఖ్యమంత్రి మన కేసీఆర్. 60 ఏళ్లలో జరిగిన పని ఈ తొమ్మిది ఏళ్లలో చేసి చూపారు మన ముఖ్యమంత్రి. కాళేశ్వరం ప్రాజెక్టు ఇతర దేశాలకు పాఠాలు నేర్పుతుంది అని అమెరికా ఇంజనీర్లు అన్నారు. అది తెలంగాణకు దక్కిన గొప్ప గౌరవం.

ఐటీ ఎగుమతులను పెంచాము. ధాన్యం దిగుబడులు రికార్డ్ స్థాయిలో వస్తున్నాయి. ఇవి తెలంగాణ విజయాలు. వాస్తవాలు చెప్పుకోవాలి. అన్ని రంగాల్లో తెలంగాణ అఖండ విజయాలను సాధించింది. దండుమల్కాపూర్ పార్క్‌లో ఏర్పాటు చేసిన స్కిల్ బిల్డింగ్ సెంటర్‌లో వేల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తామని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+