ఆ హీరోలకు ఉచ్చు - బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక ఆదేశాలు..!!
దుమారం రేపుతున్న బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు లో పలువురు సినీ ప్రముఖులు.. టీవీ యాక్టర్లు.. సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లు ఉన్నారు. వీరికి నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్దమైంది. ముఖ్యమంత్రి రేవంత్ ఈ యాప్స్ విషయం లో సీరియస్ గా ఉన్నారు. ఈ యాప్స్ ను ప్రమోట్ చేసే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేసారు. ఇదే సమయంలో తాజాగా ఈ బెట్టింగ్ యాప్స్ విచారణ పైన డీజీపీ కీలక ఆదేశాలు జారీ చేయటం సంచనలంగా మారుతోంది.
సిట్ ఏర్పాటు
తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ కేసు అనూహ్య మలుపు తీసుకుంది. ఈ కేసులో బాధ్యుల పైన చర్య లు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. దీంతో, పోలీసులు ఈ కేసు విచారణను వేగ వంతం చేసారు. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసిన పోలీసులు.. మరో ఇద్దరిని విచారణ చేసారు. కాగా, తాజాగా..బెట్టింగ్ యాప్స్ దర్యాప్తుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. సిట్ చీఫ్ గా ఐజీ ఎం రమేష్‌ను నియమించారు. సభ్యులుగా ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్, శంకర్‌లను నియమిస్తూ డీజీపీ ఆదేశాలు ఇచ్చారు.

సీఎం రేవంత్ సీరియస్
ఇప్పటికే బెట్టింగ్ యాప్స్‌పై రెండు కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ పంజాగుట్టతోపాటు సైబరాబాద్ మియాపూర్‌లో కేసులు నమోదు అయ్యాయి. 25 మంది టాలీవుడ్, బాలీవుడ్, యూట్యూబర్స్, టీవీ యాంకర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రెండు కేసులను కూడా సిట్‌కు బదిలీ చేస్తూ ఆదేశాలు చేశారు. 90 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక అందించాలని సీట్‌ను డీజీపీ ఆదేశించారు. మరో వైపు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం టాలీవుడ్‌ను కుదిపే స్తున్నది. ఇప్పటికే పలువురు నటీనటులపై కేసు నమోదైంది. నటుడు నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లపై కూడా కేసులు నమోదయ్యాయి.
ప్రముఖులకు ఉచ్చు
బెట్టింగ్ యాప్స్ పైన ఇమ్మాని రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నటులు బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసినట్లుగా ఆరోపించారు. ఓ టాక్ షోలో పాల్గొన్న సమయంలో అక్రమ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ నిర్వహించినట్లు ఆయన ఆరోపించారు. టాక్‌లో బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించగా.. స్పెషల్ ఎపిసోడ్‌లో ప్రభాస్, గోపీచంద్ కనిపించారు. దీంతో, ఇప్పుడు సిట్ ఏర్పాటుతో ఈ కేసులో వేగం పెరిగే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా కేసులు నమోదైన హీరోల నుంచి అందిరినీ విచారించే ఛాన్స్ ఉంది. ప్రభుత్వం సీరియస్ గా ఉండటం.. సిట్ ఏర్పాటుతో బెట్టింగ్ యాప్స్ కేసు లో చోటు చేసుకునే పరిణామాల పైన ఉత్కంఠ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications