తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల: రేపట్నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

హైదరాబాద్: టీఎస్-ఈసెట్(TS ECET)-2023 ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఈ ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. ఈ ఏడాది 93.07 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఆయన తెలిపారు.

ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మే 20న జరిగిన ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 22వేల మందికిపైగా విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే. పాలిటెక్నిక్, బీఎస్సీ(మ్యాథ్స్) పూర్తి చేసిన విద్యార్థులకు ఈసెట్‌లో సాధించిన ర్యాంకుల ఆధారంగా బీఈ/బీటెక్/బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశాల కల్పిస్తుంటారు.

 tsecet

టీఎస్-ఈసెట్(TS ECET)-2023 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయవచ్చు. https://ecet.tsche.ac.in/

రేపట్నుంచి తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం (జూన్ 14) నుంచి జరగనున్నాయి. ఈ పరీక్షలకు 71,681 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు. పది సప్లిమెంటరీ పరీక్షలకు 259 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. మొత్తం 2,800 మంది ఇన్విజిలేటర్లను నియమిస్తున్నామని చెప్పారు. 50 ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు పర్యవేక్షిస్తాయని ఆయన తెలిపారు.

ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు కూడా విడులైన సంగతి తెలిసిందే. మరోవైపు, ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 12 నుంచి ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం తప్పిన విద్యార్ధులతోపాటు బెటర్‌మెంట్‌ కోసం మొత్తం 93,008 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మొదటి రోజు పరీక్షకు 84,835 మంది హాజరయ్యారు. ద్వితీయ ఏడాది పరీక్షలకు 31,298 మందికిగాను 27,359 మంది హాజరయ్యారు.

 exams

విడుదలైన బీఈడీ ఫలితాలు : తెలంగాణలో బీఈడీ(BEd) ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మే 18న నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి సోమవారం సాయంత్రం విడుదల చేశారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 49 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 27,495 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 26,994 మంది అభ్యర్థులు అంటే 98.18 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు లింబాద్రి వెల్లడించారు. ఎడ్‌సెట్‌లో తాండూరుకు చెందిన జీ వినీషకు తొలి ర్యాంక్ సాధించగా, హైదరాబాద్‌కు చెందిన నీశా కుమారి 2వ ర్యాంక్ పొందారు.

తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+