తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల: ఇలా తెలుసుకోండి, రేపు ఈసెట్ ఫలితాలు

హైదరాబాద్: తెలంగాణలో బీఈడీ(BEd) ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మే 18న నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి సోమవారం సాయంత్రం విడుదల చేశారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 49 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 27,495 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 26,994 మంది అభ్యర్థులు అంటే 98.18 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు లింబాద్రి వెల్లడించారు. ఎడ్‌సెట్‌లో తాండూరుకు చెందిన జీ వినీషకు తొలి ర్యాంక్ సాధించగా, హైదరాబాద్‌కు చెందిన నీశా కుమారి 2వ ర్యాంక్ పొందారు.

తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Telangana Edcet results released: TS ECET results will be released on June 13th

టీఎస్-ఈసెట్(TS ECET)-2023 ఫలితాల విడుదల తేదీ ఖరారైంది. ఈ ఫలితాలను మంగళవారం (జూన్ 13) మధ్యాహ్నం 3.30 గంటలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేయనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మే 20న జరిగిన ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 22వేల మందికిపైగా విద్యార్థులు హాజరైనట్లు ఈసెట్ కన్వీనర్ శ్రీరాం వెంకటేశ్ తెలిపారు. పాలిటెక్నిక్, బీఎస్సీ(మ్యాథ్స్) పూర్తి చేసిన విద్యార్థులకు ఈసెట్ ర్యాంకుల ఆధారంగా బీఈ/బీటెక్/బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశాలు కల్పిస్తుంటారు.

టీఎస్-ఈసెట్(TS ECET)-2023 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయవచ్చు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+