Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్: జూన్ 12న తెలంగాణ టెట్, ఏప్రిల్ 12 వరకు దరఖాస్తుకు అవకాశం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. లక్షలాది మంది అభ్యర్థులు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న టెట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తాజాగా గురువారం టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) నోటిఫికేషన్ విడుదల చేసింది.
అభ్యర్థులు మార్చి 26 నుంచి ఏప్రిల్ 12 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జూన్ 12న టెట్ పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

telangana education department released TET notification: EXam on June 12th

టెట్‌లో మార్పులు ఇలా..

ఇప్పటివరకు బీఈడీ అభ్యర్థులు 6-10 తరగతులు బోధించేందుకు మాత్రమే అర్హులు. అందుకు టెట్‌లో పేపర్‌-2 రాసేవారు. ఇక నుంచి వారు 1-5 తరగతులకు బోధించేందుకు ఎస్జీటీలుగా నియమితులు కావొచ్చు. అంటే వారు టెట్‌లో పేపర్‌-1 రాయవచ్చు. కాకపోతే ఉద్యోగంలో చేరిన రెండేళ్లలోపు ప్రాథమిక విద్య బోధనలో ఆరు నెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలి. ఇప్పటివరకు పేపర్‌-1కు కేవలం డీఈడీ వారు మాత్రమే అర్హులు.

టెట్ వ్యాలిడిటీ జీవితాంతం

ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే ఆ ధ్రువపత్రానికి ఇప్పటివరకు ఏడేళ్ల కాలపరిమితి ఉండేది. ఆ తర్వాత దానికి విలువ ఉండదు. మళ్లీ టెట్‌ రాసుకోవాల్సిందే. అందుకు భిన్నంగా ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే జీవితాంతం విలువ ఉండేలా మార్పు చేయాలని ఎన్‌సీటీఈ రెండేళ్ల క్రితమే నిర్ణయించింది. ఈ క్రమంలో విద్యాశాఖ ఆ ప్రకారం మార్పు చేసింది. 2011 ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఆ మార్పు వర్తిస్తుంది. అప్పటినుంచి జరిగిన టెట్‌లో అర్హత సాధించిన వారి ధ్రువపత్రం ఇప్పుడూ చెల్లుబాటవుతుంది.

రాష్ట్రంలో ఇప్పటికే టెట్‌ పాసైన వారు సుమారు 3 లక్షల మంది ఉంటారని అంచనా. టెట్‌ను 150 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు 90 మార్కులు (60 శాతం), బీసీలకు 75 మార్కులు (50 శాతం), ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు 60 మార్కులు (40 శాతం) మార్కులు వస్తే అర్హత సాధించినట్లుగా పరిగణిస్తారు. టెట్‌లో వచ్చిన మార్కులకు ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా నిర్వహించే పరీక్షలకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయిస్తారు.

పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో 2022-2023 విద్యా సంవ‌త్సరానికి పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్) నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు ఏప్రిల్ రెండో వారం నుంచి పాలీసెట్ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 4 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది.

రూ.100 ఆలస్య రుసుముతో జూన్‌ 5 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. జూన్‌ 30న పాలీసెట్‌ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపింది. పాలీసెట్ ద్వారా ప‌దో త‌ర‌గ‌తి పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఇంజ‌నీరింగ్‌/నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తారు. అందువల్ల పాలీసెట్ రాయాలంటే పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+