ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తోన్న కేంద్రం
కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలో విద్యారంగానికి పెద్ద పీట వేసిన ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కనీసం చిన్న అభినందన కూడా లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆక్షేపించారు. రాష్ట్రానికి రావల్సిన నిధులను రానివ్వకుండా ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తోందంటూ కేంద్రంపై మండిపడ్డారు. రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రాథమిక పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం స్థాయి వరకు అన్ని విద్యాసంస్థల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన ఉపాధ్యాయులు, అధ్యాపకులకు సబితా ఇంద్రారెడ్డి చేతులమీదగా పురస్కారాలను అందజేశారు.

రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దేందుకు రూ.7,500 కోట్లు వెచ్చించి 'మన ఊరు - మన బడి' కార్యక్రమం కింద మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశామని చెప్పారు. తెలంగాణలో వెయ్యి గురుకులాలు, ఇంటర్‌లో 1500 గురుకులాలు, 80 డిగ్రీ గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ సర్కారుదేనని స్పష్టం చేశారు. గతేడాది 3 లక్షల మంది, ఈ ఏడాది 2.5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని వెల్లడించారు.












Click it and Unblock the Notifications