ప్రతిపక్షాలు కోలుకోలేని దెబ్బ కొట్టిన కేసీఆర్!!

తెలంగాణ సీఎం కెసిఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో దూకుడు పెంచారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల కంటే ముందే ఎన్నికల బరిలోకి దిగుతున్న అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ వారికి బి ఫారాలు కూడా అందజేశారు. అప్పుడే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన కేసిఆర్ తనదైన శైలిలో ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే ప్రతి ప్రతిపక్ష పార్టీలకు చెక్ పెట్టేలా కెసిఆర్ తాజాగా ప్రకటించిన మేనిఫెస్టో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

గత కొద్దిరోజుల నుంచి మంత్రి హరీష్ రావు, మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలకు మైండ్ బ్లాంక్ అయ్యే మేనిఫెస్టో రాబోతుందని సంచలన ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనలకు తగ్గట్టు తెలంగాణ సీఎం కెసిఆర్ తాజాగా విడుదల చేసిన బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రతిపక్ష పార్టీల అంచనాలకు అందకుండా ఉంది.

 Telangana Elections: KCR dealt an irreparable blow to the opposition!!

కెసిఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు కేసీఆర్ బీమా పథకం, 5 లక్షల రూపాయలతో భీమా సౌకర్యం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తుంది. అంతేకాదు తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు అన్నపూర్ణ పథకం ద్వారా సన్న బియ్యాన్ని అందిస్తామని కేసీఆర్ చెప్పడం, అలాగే ఆసరా పింఛన్లను దశలవారీగా పెంచుతామని ప్రకటించడం అందరిని ఆకట్టుకుంటుంది.

ఇక ఎన్నికల సమయంలో జర్నలిస్టులను కూడా ఆకట్టుకునేలా కేసీఆర్ జర్నలిస్టుల కోసం అక్రెడిటేటెడ్ జర్నలిస్టులకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని, 15 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలను అందిస్తామని చెప్పడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసైన్డ్ భూములపై ఆంక్షలను ఎత్తివేయడం, ఇళ్ల స్థలాలు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కూడా ఫోకస్ అవుతుంది.

హైదరాబాద్లో మరో లక్ష డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టడం, సౌభాగ్య లక్ష్మీ పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు మూడు వేల రూపాయల భృతి ఇవ్వడం వంటి మేనిఫెస్టో అంశాలు కూడా ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు కెసిఆర్ విడుదల చేసిన మేనిఫెస్టో నిజంగానే ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. ఊహించిన విధంగానే ఎన్నికల సమయంలో కెసిఆర్ అదిరిపోయే మేనిఫెస్టోను ప్రవేశపెట్టి ప్రతిపక్షాలను కోలుకోలేని దెబ్బ తీశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ముందు ప్రతిపక్ష పార్టీల మ్యానిఫెస్టోలు ఏమాత్రం పనికిరావని చర్చ జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+