డిపాజిట్లు కూడా తిరిగి ఇప్పించలేకపోయిన పవన్ ఛరిష్మా: బర్రెలక్కే బెటర్ కదా
Pawan Kalyan: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు గల్లంతయ్యారు. కాంగ్రెస్ సునామీలో కొట్టుకుపోయారు. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని మరీ బరిలోకి దిగినప్పటికీ- కనీసం డిపాజిట్లను సైతం వెనక్కి తెచ్చుకోలేకపోయారు. స్వయంగా పవన్ కల్యాణే ప్రచారంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది.
ఎనిమిది నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తే.. అన్ని చోట్లా ఓడిపోయారు. కనీసం గట్టి ప్రతిఘటన కూడా ఇవ్వలేకపోయారు. ఆయా నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కంటే దారుణంగా వారికి ఓట్లు పడ్డాయి. పవర్ స్టార్ అనే ఛరిష్మా ఉన్నప్పటికీ.. ఎన్నికల్లో అది ఏ మాత్రం కూడా ఉపయోగపడలేదు. కనీసం డిపాజిట్లు కూడా తిరిగి ఇప్పించలేకపోయారు పవన్ కల్యాణ్.

కూకట్ పల్లిలో పోటీ చేసిన ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఒక్కరే చెప్పుకోదగ్గ ఓట్ల సంఖ్యను నమోదు చేశారు. ఆయనకు 39,830 ఓట్లు పోల్ అయ్యాయి. మిగిలిన ఏడు నియోజకవర్గాల్లోఎక్కడే గానీ జనసేన అభ్యర్థులను ఓటర్ల నుంచి ఆదరణ లభించలేదు.
తాండూరు- నేమూరి శంకర్ గౌడ్ 4,087, కోదాడ- మేకల సతీశ్ రెడ్డి- 2,151, నాగర్ కర్నూల్- వంగ లక్ష్మణ్ గౌడ్ 1,955, ఖమ్మం- మిర్యాల రామకృష్ణ 3,053, కొత్తగూడెం- లక్కినేని సురేందర్ రావు 1,945, వైరా (ఎస్టీ)- డాక్టర్ తేజావత్ సంపత్ నాయక్ 2,712, అశ్వారావుపేట (ఎస్టీ)- ఉమాదేవి 2,281 ఓట్లు పోల్ అయ్యాయి.
బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే కనీసం ఆ మాత్రం ఓట్లు అయినా పోల్ అయ్యాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే- జనసేన- బీజేపీ ఉమ్మడి అభ్యర్థుల కంటే కూడా స్వతంత్ర అభ్యర్థిగా నాగర్ కర్నూల్ జిల్లాలోని కొడంగల్ నుంచి పోటీ చేసిన కర్నె శిరీష అలియాస్ బర్రెలక్కకు వచ్చిన ఓట్లే అధికం. ఆమెకు 5,754 ఓట్లు పడ్డాయి.












Click it and Unblock the Notifications