ప్రగతిభవన్ నుంచి ఫాంహౌస్‌కు వేల కోట్లు, ధరణితో భూకబ్జాలు: ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్ అంటూ భట్టి, యాష్కీ సంచలనం

ఎగ్జిట్ ఫోల్స్ ఫలితాల తర్వాత అధికార బీఆర్ఎస్ నేతలు భయపడిపోతున్నారన్నారంటూ విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. వరుసగా కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశాలు పెడుతూ బీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా, కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, మధుయాష్కీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.

ధరణి పోర్టల్‌లో వేలాది ఎకరాలు అక్రమంగా ఎక్కించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేసిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ పోర్టల్ ద్వారా లక్షల ఎకరాలు ప్రజలకు, ప్రభుత్వానికి దక్కకుండా పోయాయని మండిపడ్డారు. రెవెన్యూ వ్యవస్థను ముందుగానే అప్రమత్తం చేస్తున్నామని ఆయన తెలిపారు. అధికారులు తప్పు చేయొద్దని, జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు భట్టి విక్రమార్క.

ఎన్నికల కోడ్ వచ్చేదాక రైతుబంధు విడుదల కాకుండా చేశారని భట్టి మండిపడ్డారు. కోడ్ అమలులోకి రాగానే రైతుబంధు విషయంలో అందరిని మోసం చేసే ప్రయత్నం చేశారని విమర్శించారు. ప్రభుత్వాలు మారుతాయని తెలిసి ముందుస్తు నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడే ముందు ప్రభుత్వం మారనున్న ఈ తరుణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.

telangana exit polls: bhatti vikramarka and madhu yashki slams brs govt

సర్వే సంస్థలు అన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రకటించాయని భట్టి చెప్పారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, ప్రజలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ధరణిలో తప్పుడుగా నమోదు చేస్తున్నట్లు ఆరోపించారు. వేరే వ్యక్తుల పేర్ల మీదకు మార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆయన విమర్శించారు.

మరోవైపు, ధరణిలో రాత్రికి రాత్రి భూములను ఇతరుల పేర్లపై మారుస్తున్నారని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ ఆరోపించారు. రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, ఇందులో అనుమానమే అవసరం లేదన్నారు. రైతులకు రైతుబంధు ఇవ్వకుండా ఆ డబ్బును దారి మళ్లించేందుకు కేసీఆర్‌ పావులు కదుపుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు మద్దతుగా నిలుస్తున్న అధికారులు, కాంట్రాక్టర్లు ఆరిపోతున్న దీపానికి సహాకరిస్తే ఇబ్బందుల్లో పడక తప్పదని హెచ్చరించారు మధుయాష్కీ.

రాష్ట్రంలో జరిగిన అవినీతిపై కల్వకుంట్ల కుటుంబాన్ని వదిలిపెట్టేది లేదని మధుయాష్కీ తేల్చి చెప్పారు. కల్వకుంట్ల కవిత లిక్కర్ కుంభకోణంపై కూడా విచారణ జరిపిస్తామన్నారు. అవినీతికి సహకరించే అధికారులు సైతం జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. ప్రగతిభవన్ నుంచి ఫాంహౌస్ తరలుతున్న కోట్లాది రూపాయలు అవినీతి సొమ్మును అధికారులు కట్టడి చెయ్యాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లు దండుకునేందుకు అధికారంలోకి వస్తామని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఉద్యమ పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీకి ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+