అలెర్ట్: ఇంటర్ అడ్మిషన్లు -సెల్ఫ్ ఎన్‌రోల్‌మెంట్‌, జులై7 లాస్ట్ -స్కూళ్లకు జూన్ 15 వరకు సెలవులు

విద్యారంగానికి సంబంధించి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే లాక్ డౌన్ ను జూన్ 9 వరకు పొడగించిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు వేసవి సెలవుల్ని సైతం పొడగించారు. మే 31తో ముగియాల్సిన వేసవి సెలవులను జూన్ 15 వరకు పొడిగిస్తున్నామని, స్కూళ్ల రీఓపెనింగ్ ఎప్పుడనేది తర్వాత వెల్లడిస్తారు. మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లతోపాటు డైట్ కాలేజీలకు కూడా ఈ వేసవి సెలవుల పొడిగింపు వర్తిస్తుందని విద్యా శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. కరోనా వ్యాపిస్తున్న తీరును నిశితంగా పరిశీలిస్తున్నామని, అందుకే సెలవుల పొడిగింపు నిర్ణయం తీసుకున్నామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు. మరోవైపు..

 Telangana extended summer holidays for schools till June 15, inter board on admissions

పదో తరగతి ఫలితాలు వెల్లడికావడంతో ఇంటర్ అడ్మిషన్లకు సంబంధించి తెలంగాణ ఇంట‌ర్ బోర్డ్ కీల‌క నిర్ణయం తీసుకుంది. క‌రోనా వ్యాప్తి దృష్యా ఈ ఏడాది విద్యార్థులు బయటికి రాకుండానే, ఇంళ్లలో నుంచే ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు పొందే సౌకర్యాన్ని కల్పించింది. 404 ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని, విద్యార్థులకు వెబ్‌సైట్‌లో మంగళవారం(జూన్ 1) నుంచే సెల్ఫ్ ఎన్‌రోల్‌మెంట్‌ ఆన్‌లైన్‌ ఆప్షన్‌ ఇచ్చారు. జులై 7 వ‌ర‌కు ఆన్‌లైన్‌‌లో అడ్మిష‌న్ పొంద‌వ‌చ్చని తెలంగాణ ఇంటర్‌ బోర్డు పేర్కొంది. కాగా,

తెలంగాణ ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 2,524 కేసులు, 18 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం మరణాలు 3,281కి, మొత్తం కేసులు 5,78,351కు పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 34,084 యాక్టివ్‌ కేసులున్నాయి. జూన్ 9 వరకు లాక్ డౌన్ పొడిగించిన ప్రభుత్వం.. రోజూ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపులు కల్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+