తెలంగాణలో ZPTC, MPTC, గ్రామ పంచాయతీ స్థానాలు ఖరారు.. పూర్తి లిస్ట్ ఇదే..
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది ఈ నేపథ్యంలో జడ్పీ, ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ స్థానాలను తెలంగాణ ప్రభుత్వం నిర్థారించింది. ఈ మేరకు స్థానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వ జీవో జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీ సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో జడ్పీ, ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ స్థానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈమేరకు జీవో జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో జడ్పీలు 31, ఎంపీపీలు 566, జడ్పీటీసీలు 566, ఎంపీటీసీలు 5,773, గ్రామ పంచాయతీలు 12,778, వార్డులు లక్షా 12 వేలుగా ఉన్నాయి. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీల స్థానాల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాయతీ సిబ్బంది అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని, సామగ్రిని రెడీ చేసుకోవాలని సర్కార్ సూచనలు చేసింది.
అయితే తెలంగాణలో గతంతో పోల్చితే ఎంపీటీసీల సంఖ్యను కుదించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంతకు ముందు కంటే 44 స్థానాలను తగ్గిస్తూ 5773 ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఈ లిస్టులో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 353, అతి తక్కువగా ములుగు జిల్లాల్లో 83 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టులో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఆర్డినెన్స్ ను తయారు చేసిన ప్రభుత్వం దాన్ని ఆమోదం కోసం ఇప్పటికే గవర్నర్ వద్దకు పంపింది.












Click it and Unblock the Notifications