టీడీపీ ఆధ్వర్యంలో తెలంగాణా ఆవిర్భావ వేడుకలు; ఆసక్తికరంగా చంద్రబాబు శుభాకాంక్షలు!!

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్లో ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. తెలంగాణ ఆవిర్భావం ఒక చరిత్రని కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర కల సాకారం అవ్వడానికి అసెంబ్లీ నుంచి మొట్టమొదటి ప్రతిపాదనలు ఇచ్చింది చంద్రబాబునాయుడు అని కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు, యువత కలలుగన్న తెలంగాణ రాలేదని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు.

Telangana formation Celebrations under TDP in NTR bhavan; chandrababu wishes to telangana people

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత అభివృద్ధి జరగలేదన్నారు. ఆనాడు ఎందరో యువత ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, కానీ దానికి ఫలితం ఇది కాదన్నారు. ప్రస్తుతం ఉన్న దుష్ట ప్రభుత్వం పోవాల్సిందేనని, యువత ఆలోచించాల్సిన సమయం వచ్చిందని ఇలా కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు వారు, తెలుగు జాతి ఎక్కడున్నా అగ్రస్థానంలో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలిపారు. తెలుగు జాతి కోసం టిడిపి నిరంతరం శ్రమించిన పార్టీ అని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ సందర్భంగా తెలుగు జాతి కోసం ఎంతో కృషి చేసిన పలువురు మహనీయులను స్మరించుకున్నారు.

Telangana formation Celebrations under TDP in NTR bhavan; chandrababu wishes to telangana people

తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు పోరాటం చేశారని, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి ఎన్టీఆర్ చాటి చెప్పారని చంద్రబాబు తెలిపారు. దేశానికి దశ దిశ చూపిన నాయకుడు పి.వి.నరసింహారావు అని పేర్కొన్న చంద్రబాబు, 1991లో దేశ ఆర్థిక సంస్కరణలకు పీవీ నరసింహారావు శ్రీకారం చుట్టారన్నారు.

ఇప్పుడు మళ్ళీ సమయం వచ్చిందని, తెలుగుజాతి పునర్నిర్మాణానికి ప్రస్తుతం కృషి చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సమైక్య రాష్ట్రంలో విజన్ 2020తో అభివృద్ధికి బాటలు వేశామన్న చంద్రబాబు, ఏపీలో రెండో తరం సంస్కరణలు తీసుకు వచ్చామన్నారు. పేదలకు సంక్షేమ పథకాలను అందించామన్నారు. సంస్కరణలకు సాంకేతికత జోడించామని, సంపద సృష్టించామని చంద్రబాబు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+