తెలంగాణకు మాటిచ్చిన సోనియా గాంధీ
Revanth Reddy: తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగే తొలి వేడుకలు ఇవే కావడంతో దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వైభవంగా వ్యవస్థాపక దినోత్సవాలను నిర్వహిస్తోంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఈ ఉదయం గన్ పార్క్‌లోని అమర వీరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన వేడుకలకు హాజరయ్యారు. అక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.

ఇదే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించారాయన. అందె శ్రీ రాసిన జయ జయహే తెలంగాణ.. గేయం ఇది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. అమర వీరుల ఆశయాలు, తెలంగా సమాజం కన్న కలలు నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుందని అన్నారు. రాష్ట్ర సాంస్కృతిక, ఆర్థిక పునరుజ్జీవనానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ ప్రజలకు శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ మేరకు ఆమె ఢిల్లీలోని తన నివాసం నుంచి ఓ వీడియో సందేశాన్ని పంపించారు. 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలు తమ పార్టీని ఎంతగానో ప్రేమించారని గుర్తు చేశారు.
సుసంపన్నమైన, సుభిక్షమైన రాష్ట్రాన్ని నిర్మించే బాధ్యతను తమ పార్టీకి అప్పగించారని వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధి కట్టుబడి ఉన్నామని, హామీలన్నింటినీ చిత్తశుద్ధితో అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు కన్న కలలన్నింటినీ సాకారం చేయడం తన కర్తవ్యంగా భావిస్తున్నానని సోనియా గాంధీ అన్నారు.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభదినాన తెలంగాణలో అధికారంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీని నెరవేర్చడంలో వెన్నుచూపబోమని సోనియా గాంధీ పునరుద్ఘాటించారు.












Click it and Unblock the Notifications