హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆవిర్భావ వేడుక: విద్యుద్దీపాలంకరణతో మెరిసిన హైదరాబాద్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి రాజధాని నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్తు దీపాలు, పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. అంబురాన్నంటే స్థాయిలో సంబురాలు నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఏర్పాట్లు చేశారు.

చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ భవనాలను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. హుస్సేన్‌ సాగర్‌లో బుధవారం రాత్రి 8.30 నుంచి బాణాసంచాతో పర్యాటక శాఖ 'ఫైర్‌వాల్‌' కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. పురివిప్పిన నెమళ్లు, కనువిందు చేసే పూలు ఇంకా అనేక రకాల అలంకారాలతో నగర కూడళ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి.

పార్కుల్లో ఉచిత ప్రవేశం: ఎన్టీఆర్‌ గార్డెన్‌, లుంబినీ పార్కు, సంజీవయ్య పార్కు తదితరాల్లో గురువారం ఉచితంగా ప్రవేశం కల్పించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

నోరూరించే రుచులతో ఆహ్వానం:

తెలంగాణ రుచులతో నగరంలోని ప్రముఖ హోటల్స్‌ ఆహ్వానం పలుకుతున్నాయి. భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు ఫుడ్‌ ఫెస్టివల్స్‌ నిర్వహిస్తున్నాయి. శాకాహార, మాంసాహార ప్రియులకు వివిధ రకాల వంటకాలను రుచి చూపించనున్నారు.

నాటుకోడి కూర, ఎండు రొయ్యల పులుసు, కాళ్ల షోర్భాల వంటి వాటిని కోడి పలావ్‌తో కలిపి వడ్డించనున్నారు. శాకాహారుల కోసం వంకాయ బఠాణీ కూర, చామదుంప ఫ్రై, టమాటా వంకాయ, బీరకాయ వేపుడు, పులిహోరలతోపాటు పలు రకాల పప్పులు, సాంబార్లు వంటి వాటిని రాగి ముద్దలతో కలిపి వడ్డించనున్నారు.

ఆవిర్భావ వేడుకలు

ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి రాజధాని నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్తు దీపాలు, పూలతో ప్రత్యేకంగా అలంకరించారు

ఆవిర్భావ వేడుకలు

ఆవిర్భావ వేడుకలు

అంబురాన్నంటే స్థాయిలో సంబురాలు నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఆవిర్భావ వేడుకలు

ఆవిర్భావ వేడుకలు

చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ భవనాలను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. హుస్సేన్‌ సాగర్‌లో బుధవారం రాత్రి 8.30 నుంచి బాణాసంచాతో పర్యాటక శాఖ ‘ఫైర్‌వాల్‌' కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

ఆవిర్భావ వేడుకలు

ఆవిర్భావ వేడుకలు

పురివిప్పిన నెమళ్లు, కనువిందు చేసే పూలు ఇంకా అనేక రకాల అలంకారాలతో నగర కూడళ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి.

ఆవిర్భావ వేడుకలు

ఆవిర్భావ వేడుకలు

రాష్ట్ర అవతరణ వేడుకలకు ముస్తాబైన నగరం సప్తవర్ణ శోభతో అలరారుతోంది. మరోపక్క పరేడ్ మైదానంలో వేడుకలకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.

ఆవిర్భావ వేడుకలు

ఆవిర్భావ వేడుకలు

వేడుకలకు స్వాగతం పలుకుతూ హెచ్‌ఎండీఏ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది.

ఆవిర్భావ వేడుకలు

ఆవిర్భావ వేడుకలు

సంజీవయ్య పార్కులో ఎత్తైన జాతీయ పతాకం ఎగురవేయడానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. దసరా, దీపావళి కలిసి వచ్చినట్టు నగరమంతా పండుగశోభను సంతరించుకుంది.

ఆవిర్భావ వేడుకలు

ఆవిర్భావ వేడుకలు

రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను పురస్కరించుకొని నగరంలోని ప్రధాన మార్గాలు, జంక్షన్లలో చేపడుతున్న లైటింగ్, శానిటేషన్ పనులను జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి బుధవారం తనిఖీ చేశారు.

ఆవిర్భావ వేడుకలు

ఆవిర్భావ వేడుకలు

గన్‌పార్క్, లుంబినీ పార్కు, ట్యాంక్‌బండ్, సంజీవయ్య పార్కు, పరేడ్ గ్రౌండ్స్, రాజ్‌భవన్ రోడ్ తదితర ప్రధాన మార్గాలలో చేపట్టిన విద్యుద్దీపాల ఏర్పాట్లను తిలకించారు. రాజధానిలో పండుగ వాతావరణం తలపించేలా రూ.1.21కోట్ల వ్యయంతో ఏర్పాట్లు చేశామన్నారు.

ఆవిర్భావ వేడుకలు

ఆవిర్భావ వేడుకలు

వంద జంక్షన్లలో ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు. 2,247 ఫ్లడ్‌లైట్లు, 530 కలర్ లైట్లు, మరో 240 హాలోజన్ లైట్లను ఏర్పాటు చేశామన్నారు. 1,721 పార్‌క్యాన్స్ ఎల్‌ఈడీ లైట్లు, 9,529 సిరీస్ లైట్లను అమర్చామన్నారు.

ఆవిర్భావ వేడుకలు

ఆవిర్భావ వేడుకలు

ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఫీవర్ ఆసుపత్రి, ఎంఎన్‌జే, సరోజిని, ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రితో పాటు ముషీరాబాద్‌లోని ఈఎస్‌ఐ డైరెక్టరేట్ కార్యాలయం, డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ తదితర కార్యాలయాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.

English summary
Hyderabad Shined With Lighting during
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X