తెలంగాణ రావడంలో చిన్నమ్మ కీ రోల్ : కొత్త భాష్యం చెప్పిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ ఇచ్చింది సోనియా, తెచ్చింది కేసీఆర్ అని తెలుసు. కానీ తెలంగాణ ఆమోదించడంలో అధికార పార్టీ కన్నా .. విపక్ష నేత సుష్మస్వరాజ్ కీ రోల్ పోషించారన్నారు బీజపీ నేత కిషన్ రెడ్డి. శుక్రవారం సికింద్రాబాద్ హరియాణ భవన్ లో 'నమో ఎగైన్' పేరుతో నిర్వహించిన సభకు సుష్మస్వరాజ్ హాజరయ్యారు.

కీ రోల్
తెలంగాణ బిల్లు ఆమోదించేందుకు సుష్మస్వరాజ్ ముఖ్యభూమిక పోషించారన్నారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. అన్నిపార్టీల మద్దతు కూడగట్టారని వివరించారు. అధికార యూపీఏతోపాటు ఎన్డీఏ మద్దతివ్వడంతోనే తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని గుర్తుచేశారు. ఇందుకోసం బీజేపీతోపాటు మిత్రపక్షాలను ఒప్పించేందుకు సుష్మా విశేషంగా కృషి చేశారని కొనియాడారు.

రుణపడి ఉంటాం
తెలంగాణ ప్రాంత ప్రజల స్వప్నం సాకారం కావడంలో కీ రోల్ పోషించిన సుష్మ స్వరాజ్ కు మనమంతా రుణపడి ఉంటామన్నారు కిషన్ రెడ్డి. ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా బీజేపీ పనిచేసిందని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ నేతలు రామచంద్రారెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications