మహిళా పారిశ్రామికవేత్తలకు బిగ్ బూస్ట్ ఇస్తున్న తెలంగాణా ప్రభుత్వం!

తెలంగాణ రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను బలోపేతం చేసే దిశగా తెలంగాణా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. మహిళల నేతృత్వంలో నడిచే వ్యాపారాలకు పెట్టుబడులు, మార్కెట్ అవకాశాలు, విధానపరమైన సహకారం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ను ఏర్పాటు చేసిందని మంత్రి సీతక్క ప్రకటించారు.

తాజాగా సచివాలయంలో నిర్వహించిన కౌన్సిల్ తొలి సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్ సందర్భంగా ఈ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కౌన్సిల్‌లో విధాన నిర్ణేతలు, మహిళా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు.

Telangana Forms Women Entrepreneurs Executive Council Minister Seethakka Announces Support for Women-Led Businesses Ahead of Global Summ

వీ-హబ్ సీఈవో సీత పల్లచోళ్ల కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు.కౌన్సిల్ నాలుగు ముఖ్యమైన స్తంభాలపై దృష్టి సారిస్తుంది. విధానం, సంస్థాగత నాయకత్వం విభాగాన్ని సెర్ప్-మెప్మా సీఈవో దివ్యా దేవరాజన్ నడిపిస్తారు. పట్టణ ఆవిష్కరణలు, పారిశ్రామికతను ఈడీటీ వ్యవస్థాపకురాలు నైయ్యా సగ్గి నిర్వహిస్తారు. సామాజిక ప్రభావం, సమగ్ర వ్యాపారాలకు సెల్కో వ్యవస్థాపకుడు హరీష్ హండే బాధ్యత వహిస్తారు.

పెట్టుబడులు, కార్పొరేట్ భాగస్వామ్యాలకు అరిస్ వెంచర్స్ వ్యవస్థాపకురాలు అంకిత వశిష్ఠ నేతృత్వం వహిస్తారు.మహిళా పారిశ్రామిక రంగంపై ప్రత్యేక శ్వేతపత్రాన్ని గ్లోబల్ సమిట్‌లో విడుదల చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ శ్వేతపత్రం తయారీలో ఈవై ప్రచురణ భాగస్వామిగా ఉంటుంది. కౌన్సిల్ సిఫార్సులను ఐటీ, పరిశ్రమలు, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖలకు అందజేసి అమలు చేస్తారు.

భారత్‌లో మహిళలు మాత్రమే స్థాపించిన స్టార్టప్‌లు 2025లో ప్రైవేట్ పెట్టుబడుల్లో కేవలం 0.97 శాతం మాత్రమే పొందాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మహిళా వ్యాపారాలను కేవలం సంక్షేమ పథకాలుగా కాకుండా ఆర్థిక వృద్ధికి ఇంజన్‌గా చూస్తోంది. రాష్ట్రంలో 65 లక్షల మందికి పైగా మహిళలు స్వయం సహాయక సంఘాల్లో ఉన్నారు.

తెలంగాణా యువతకు ఎగిరి గంతేసే వార్త.. లక్షమందికి ఉచిత ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ శిక్షణ
తెలంగాణా యువతకు ఎగిరి గంతేసే వార్త.. లక్షమందికి ఉచిత ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ శిక్షణ

ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం, ఇంక్యుబేటర్ కేంద్రాలు, మహిళా శక్తి క్యాంటీన్లు, మహిళాసూపర్ బజార్లు వంటివి ఏర్పాటు చేయటం ద్వారా గ్రామీణ, పట్టణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోంది.ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్ రాష్ట్రాన్ని అంతర్జాతీయ పెట్టుబడి కేంద్రంగా నిలబెట్టే లక్ష్యంతో నిర్వహిస్తున్నారు. ఈ సమిట్‌లో మహిళా పారిశ్రామికవేత్తలకు మరిన్ని అవకాశాలు కల్పించేలా కౌన్సిల్ కృషి చేస్తుందని మంత్రి సీతక్క ఆశాభావం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+